ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ నటిస్తోందా..!!

జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఏ చిత్రం రాలేదు. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమానీ డైరెక్టర్ కొరటాల శివతోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాలో పలు మార్పులు చేయడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది.. ఇక ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.Jr Ntr Turns 39 Ajay Devgn Wish Rrr Star A Happy Birthday - Jr Ntr  Birthday: अजय देवगन ने जूनियर एनटीआर को दी शुभकामनाएं, कहा- आपके साथ काम  करना खुशी की बात -ఇక ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపికను కూడా డైరెక్టర్ కొరటాల శివ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. అందుచేతనే ఈ సినిమాలో ఇతర నటీనటులను ఎంపిక చేసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ఒక కీలకమైన పాత్రలో కన్నడ నటి రిషిక రాజ్ ను ఎంపిక చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఎందుచేత అంటే గత సంవత్సరం ఆశ్మి అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది.Rushika Raj at Asmee Movie Press Meet

ఈ చిత్రంలో ఈమె బోల్డ్ నటిగా కూడా నటించి ప్రశంశాలు అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కన్నడలో రెండు మూడు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ చిత్రంలో ఎన్నో ఒక పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది.

Share post:

Latest