అక్కడ మళ్ళీ డిపాజిట్ గల్లంతే?

గత ఎన్నికల మాదిరిగానే …ఈ సారి ఎన్నికల్లో కూడా ఓ నియోజకవర్గంలో టీడీపీకి మళ్ళీ డిపాజిట్ రావడం కష్టమేనా? గెలుపు మాట పక్కన పెడితే..డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుందా? అంటే ఈ సారి ఆ పరిస్తితి మళ్ళీ రాకపోవచ్చు గాని..గెలుపు మాత్రం కష్టమని తెలుస్తోంది. ఇంతకీ టీడీపీ డిపాజిట్ కోల్పోయిన స్థానం ఏది…మళ్ళీ గెలుపు ఛాన్స్ లేని స్థానం ఏది అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు స్థానం.

గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు స్థానంలో టీడీపీకి పెద్ద పట్టు లేదు…మొదట నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా అరకులో వైసీపీ గెలిచింది. 2014లో వైసీపీ తరుపున గెలిచిన కిడారి సర్వేశ్వరరావు..టీడీపీ వైపుకు వచ్చారు. కానీ అనూహ్యంగా ఆయన నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. దీంతో కిడారి వారసుడు శ్రావణ్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి లాంటిది ఇవ్వలేదు. దీంతో కిడారి ఎన్నికల ముందే మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో శ్రావణ్‌కు అరకు సీటు ఇచ్చారు…కానీ ఆ ఎన్నికల్లో శ్రావణ్ దారుణంగా ఓడిపోయారు. కేవలం 19 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. వైసీపీ నుంచి చెట్టి ఫాల్గుణ విజయం సాధించారు. రెండో స్థానంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొన్ను దొర నిలిచారు. తర్వాత దొన్ను దొర టీడీపీలోకి వచ్చారు.

దీంతో ఇక్కడ టీడీపీ బలం కాస్త పెరిగింది…అదే సమయంలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది…కానీ ఆ వ్యతిరేకతని టీడీపీ నేత శ్రావణ్ ఉపయోగించుకోలేకపోతున్నారు. పెద్దగా యాక్టివ్ గా కూడా పనిచేయడం లేదు. దీంతో అరకులో టీడీపీ వెనుకబడి ఉంది…ఈ సారి డిపాజిట్ కోల్పోయే ఛాన్స్ లేదు గాని..గెలుపు అవకాశాలు మాత్రం పెద్దగా లేవు అని చెప్పొచ్చు.

Share post:

Latest