త్రివిక్రమ్ – సౌజన్యల లవ్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మాటల మాంత్రికుడిగా పేరుపొందిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన తెరకెక్కించే ప్రతి సినిమాలోని డైలాగులు సైతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేస్తూ ఉంటాయి. ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి స్టార్డం సంపాదించుకున్న డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈయన వ్యక్తిగత జీవితం గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Ala Vaikunthapurramloo: Here's why director Trivikram Srinivas' wife,  Soujanya, left him in middle of the shoot

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వివాహం ఎలా జరిగింది? అసలు పెళ్లి చూపులు కథ ఏమిటి ? అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి బంధువు.. ఇండస్ట్రీకి అప్పుడప్పుడే వచ్చి పేరు సంపాదించుకుంటున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఇంటికి అల్లుడుగా మార్చేసుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అయితే డైరెక్టర్గా మారుతున్న సమయంలో అతనిపై నమ్మకంతోనే తన సోదరుడు కూతుర్ని త్రివిక్రమ్ కు ఇప్పించేందుకు సిద్ధమయ్యారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అప్పుడే త్రివిక్రమ్ ను పెళ్లి చూపులకు తీసుకువెళ్లడం జరిగిందట.

Trivikram Wife Soujanya Srinivas Classical Dance Attracted Fans and  Audience | klapboardpost
అయితే అక్కడ పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లిన అమ్మాయిని కాకుండా ఆమె చెల్లెలు ఇష్టపడ్డాడట త్రివిక్రమ్. అయితే ఈ విషయాన్ని మాత్రం అక్కడ చెప్పలేదు. కానీ పెళ్లిచూపుల తర్వాత స్వయంగా తానే వెళ్లి తనకి నచ్చిన అమ్మాయి గురించి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారట. తనకు చిన్నమ్మాయి నచ్చింది అని చెప్పడంతో అయితే తన అక్క పెళ్లి తర్వాతే తన వివాహం చేసుకుంటానని చెప్పిందట సౌజన్య. ఆ తరువాత సౌజన్య, త్రివిక్రమ్ వివాహం చేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ భార్య ఒక డాన్సర్ కూడా.. ఇక అందుకు సంబంధించి ఒకసారి ప్రదర్శనను కూడా చేయడం జరిగింది. త్రివిక్రమ్ కి అన్ని విధాల సహాయం చేస్తూ ఉంటుంది సౌజన్య.

Share post:

Latest