ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్-కృతి శెట్టి సక్సెస్ అయ్యేరా..!!

విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే ఈయన డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు, కృతి శెట్టి నటించారు. ఇక వీరితో పాటే ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, కళ్యాణి తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Aa Ammayi Gurinchi Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుంచి  అందమైన మెలోడీ ప్రోమో - BigBoss News

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా ట్రైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీగానే స్పందన లభించింది ముఖ్యంగా సుదీర్ బాబు ,కృతి శెట్టికి వరుస ప్లాపుల ఉన్న సమయంలో ఈ సినిమా సక్సెస్ ఇస్తుందేమో అని అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి మైనస్, ప్లస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కథ:
ఈ సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందట ముఖ్యంగా ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథతో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సుధీర్ బాబు ఈ సినిమాలో కొత్తగా ట్రై చేశారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కూడా సుధీర్ బాబు డైరెక్టర్ గానే పనిచేస్తారు.. ఇక హీరోయిన్గా కృతి శెట్టి ని తన సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారు. అయితే కొన్ని సంఘటనల వల్ల సుదీర్ బాబు కృతి శెట్టి కి దూరమవుతుందట. అంతేకాకుండా కృతి శెట్టి ఇంట్లో తనని చదువుకోమని చెబుతూ ఉంటారు. కానీ ఆమెకు సినిమా అంటే ఇష్టం ఉంటుంది. అలా ఒక చిత్రంలో నటించడానికి ఒప్పుకున్న కృతి కి ఏమవుతుంది.. సుధీర్ బాబు తనకు ఎందుకు దూరం అవుతారు.. చివరికి వారు కలుస్తారా లేదా అనేది ఈ చిత్రం కథ.

స్టొరీ (+)
ఈ సినిమా కథపరంగా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్ గా ఉన్నాయి. ఇక వీటికి తోడు కామెడీ కూడా హైలెట్ గా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో సుధీర్ బాబు కృతి శెట్టి బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

స్టొరీ ( -)
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా బోరింగ్ గా అనిపించాయి. ఎడిటింగ్లో కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండు అని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వచ్చిన కథలలో కాస్త డిఫరెంట్ గా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఎట్టకేలకు కృతి శెట్టి, సుధీర్ బాబు మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.

Share post:

Latest