కుట్రపూరితంగానే బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు కూడా ఈయన సినిమాల ఫలితాలను చూసి ఆశ్చర్యపోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. వెంటనే టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగు ప్రస్తుతం టర్కీలో జరుపుకుంటుంది.

I don't know who is AR Rahman, says Nandamuri Balakrishna | Entertainment  News,The Indian Express

ఇక షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన ఇండియా తిరిగి రాబోతున్నారు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది హిజ్రాలు బాలకృష్ణపై కేసు పెట్టారు. అసలు విషయం ఏమిటంటే హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉండడం లేదని, ఎక్కువగా తన ధ్యాస సినిమాలపైనే పెడుతున్నాడు అని, కావాలనే ఎవరో ఉద్దేశపూర్వకంగా హిజ్రాలు చేత ఆయనపై కేసు పెట్టించినట్లు తెలుస్తోంది. ఇక హిజ్రాలు పెట్టిన కేసులో బాలకృష్ణ నియోజకవర్గంలో ఉండడం లేదు అని, ప్రజల పాలన గురించి పట్టించుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరును మార్చినప్పుడు బాలకృష్ణ వైసిపి పార్టీ అలాగే వైసిపి నాయకుల పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక అందుకే కొంతమంది వైసీపీ నాయకులు ఇలా బాలకృష్ణపై హిజ్రాల చేత కేసు పెట్టించినట్లు తెలుస్తోంది. నిజానికి నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉండడం లేదు. కానీ బాలకృష్ణను మాత్రమే టార్గెట్ చేయడం ఉద్దేశపూర్వకంగానే అని స్పష్టం అవుతుంది. మరి ఈ విషయంపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Share post:

Latest