సామ్ ఈ కండీషన్స్‌ ఒప్పుకుంటేనే సినిమాలకు సైన్‌ చేస్తుందట… లేదంటే లేదు!

టాలీవుడ్ హీరోయిన్‌ సమంత టైం బాగానే వుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు విజయ్‌తో ఖుషీ, హిందీలో ఓ వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తుంది. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచేసిన సామ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోషూట్స్‌తో రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే సడెన్‌గా సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇచ్చిన సమంత తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇకపై చేసే సినిమాల్లో గ్లామర్‌ రోల్స్‌, లిప్‌ లాక్‌ లాంటి సీన్స్‌కి దూరంగా ఉండాలని ఆమె డిసైడ్‌ అయ్యిందట. ఈ కండీషన్స్‌కి ఒప్పుకుంటేనే సినిమాలకు సైన్‌ చేస్తుందట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో చక్కెర్లు కొడుతుంది. సడెన్ గా సామ్ కి ఈ రియలైజేషన్ ఏంటి అని నెటిజన్లు మూతులు కొరుక్కుంటున్నారు.

ఇకపోతే పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు మాత్రమే సైన్‌ చేసిన సామ్‌ ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌లో మాత్రం బోల్డ్‌ సీన్స్‌తో ఒక్కసారిగా టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. ఇక చై, సామ్‌ మధ్య విబేధాలు తలెత్తడానికి గల కారణాలు ఇక్కడినుండి స్టార్ట్ అయ్యాయనే రూమర్స్ ఉండనే వున్నాయి. ఆ విషయం కాస్త పక్కన పెడితే… ఆ సినిమా తరువాత సామ్ కి ఆ తరహా పాత్రలు మాత్రమే వస్తున్నాయట. దాంతో విసిగి వేసారిన సమంత ఇకనుండి అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుందట.

Share post:

Latest