ఒకే ఒక జీవితం షూటింగ్ సమయంలో శర్వానంద్… మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడా..!

తల్లి – కొడుకుల‌ సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ , వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి ముఖ్య‌ పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్రలో న‌టించారు. ఈ సినిమాను సాయి కార్తిక్ అనే కొత్త‌దర్శకుడు తెర‌కెక్కించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈసంద‌ర్బంలోనే ‘ఒకే ఒక జీవితం’ టీమ్‌ థ్యాంక్యూ మీట్‌ నిర్వహించింది. ఇందులో శర్వానంద్‌ మాట్లాడుతూ… ఈ సినిమా చేస్తున్నప్పుడు తాను మానసిక ఆందోళనకు గురైనట్లు చెప్పారు. కుటుంబసభ్యులు సైతం తన విషయంలో కంగారుపడ్డారని ఆయన చెప్పుకొచ్చాడు.

Hero Sharwanand Speech at Oke Oka Jeevitham Q&A Session Press Meet l News Tv - YouTube

శ‌ర్వానంద్ మాట్లాడుతూ- ‘ ఈ సినిమాని ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా అభినంధ‌న‌లు కృతజ్ఞతలు. ఈ సినిమా హిట్‌ అవుతుందా? ప్లాప్ అవుతుందా ?ఎంత క‌ల‌క్ష‌న్‌ రాబడుతుంది? అనేది నేను ఉహించ‌లేను కానీ ఈ సినిమాని థియేటర్లలో చూస్తూన్న‌ ప్రేక్షకులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది చూసిన క్షణం నాకెంతో గొప్ప‌గా అనిపించింది. నేను సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను.ఇలాంటి అద్భుతమైన కథలో నన్ను భాగం చేసిన మా దర్శకుడికి కృతజ్ఞతలు. ఈ సినిమాని నా జీవితాంతం గుర్తుపెట్టుకునే అంత గొప్ప సినిమాని నాకు ఇచ్చారు. ఇలాంటి కథలు రాస్తే చేస్తారా? లేదా? అనే సందేహాలు పెట్టుకోకండి. అమల గారితో… కలిసి న‌టిచ‌టం ఎంతో సంతోషంగా ఉంది. మీరు మరెన్నో సినిమాల్లో నటించాలిని కోరుకుంటున్నాను అమ్మ‌ అని శర్వానంద్‌ పేర్కొన్నారు”.

 

Oke Oka Jeevitham Is A Heart-touching Film: Sharwa - Movie News

Share post:

Latest