ఆది పురుష్ తెలుగు సినిమా రైట్స్ తో ప్రభాస్ రేంజ్ పెరిగిందా..!!

ప్రభాస్ తెరకెక్కిస్తున్న సినిమాలు అన్ని ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ప్రభాస్ నటించిన గత చిత్రాలు రెండు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ప్రభాస్ తన తదుపరిచిత్రంపై అభిమానుల సైతం చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఆది పురుష్ చిత్రం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు.Adipurush: Prabhas to Play 'Prabhu Ram' to Perfection, Director Om Raut Reveals All | India.comఈ చిత్రం రామాయణం,ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు.ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించారు. ఇక సీత పాత్రలో కృతి సనన్ రావణుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ప్రభాస్ వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్ అయిన ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
ఎందుచేత అంటే ప్రస్తుతం ఆదిపరుస్తూ థియేట్రికల్ రైట్స్ విషయాన్ని తెలుస్తే అవునని చెబుతారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ సినిమా ఒక్క తెలుగు థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ.100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని UV క్రియేషన్ వారు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలుబడలేదు.

ఇదంతా ఇలా ఉండగా ప్రభాస్ తెలుగులో రూ. 100 కోట్లు మార్కెట్ ఉందని గతంలో వచ్చిన సినిమాలతో రుజువైంది ఈ నేపథ్యంలోనే UV క్రియేషన్స్ అన్ని కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. మరి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు సమాచారం మరియు చిత్రంతో ప్రభాస్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Share post:

Latest