కొడాలి నాని కోసం ప‌ని చేస్తోన్న టీడీపీ కోవ‌ర్టులు ఎవ‌రు…!

రాజ‌కీయాల్లో కోవ‌ర్టులు కామ‌న్‌. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు? దీనికి హ‌ద్దు ప‌ద్దు ఉండ‌దా? క‌నీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే క‌నీస ఆలోచ‌న కూడా ఉండ‌దా? అంటే.. ఉండ‌ద‌నే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయ‌కుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. కాదు కాదు.. ఇప్ప‌టికీ కంచుకోటే! కానీ, ఇక్క‌డ పార్టీ మాత్రం.. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ముందుకు సాగుతోం ది. దీనికి కార‌ణం ఏంటి? ఒక‌ప్పుడు అన్న‌గారు ఎన్టీఆర్‌ను గెలిపించిన గుడివాడ ప్ర‌జ‌లకు టీడీపీ అంటే బోరు కొట్టిందా? అనేది ప్ర‌శ్న‌.

అంతేకాదు.. 2004, 2009 ఎన్నిక‌ల్లోనూ కొడాలి నానిని టీడీపీ టికెట్‌పై గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఆ పార్టీ అంటే అంతగా వ్య‌తిరేక‌త పెరిగిందా? అనేది ప్ర‌శ్న‌. కానీ, దీనిని స్థానిక రాజ‌కీయ ప‌రిశీల‌కులు తోసిపుచ్చుతు న్నారు. ఎందుకంటే.. ఇక్క‌డ టీడీపీ గెల‌వ‌క‌కాద‌ని.. కొంద‌రు ఉద్దేశ పూర్వ‌గానే.. కోవ‌ర్టులుగా మారి పార్టీని ఓడిస్తార‌ని అంటున్నారు. ఎన్నిక‌ల‌కుముందు వ‌రకు టీడీపీ నేత‌లుగా ఉన్న నాయ‌కులు.. ఎన్నిక‌లు స‌మీపించ‌గానే కోవ‌ర్టుల అవ‌తారం ఎత్తుతున్నార‌ని.. స్థానిక ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

నిజానికి ఇక్క‌డ టీడీపీకి సానుభూతి ఉంది. ఇది ఓటు బ్యాంకు కూడా మారుతుంది. ఈ విష‌యంలో ఢోకా లేదు. అంతేకాదు.. కొడాలి నాని..వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్న తీరు చూస్తే.., ఆయ‌న 17 వేల‌తో 2009లో టీడీపీ త‌ర‌ఫున‌.. కేవ‌లం 11 వేల‌తో 2014లో వైసీపీ త‌ర‌ఫున.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అంటే.. టీడీపీ బ‌ల‌మైన పోటీ ఇచ్చిన‌ట్టుగానే భావించాలి. మ‌రి ఎందుకని.. 2014 నుంచి 2019 వ‌ర‌కు ఓట‌మి చెందుతోం ది? అంటే.. ఇక్క‌డ కొంద‌రు టీడీపీ నేత‌లు.. నానితో లోపాయికారీ సంబంధాలు పెట్టుకున్నార‌నేది విశ్లేష కుల వాద‌న‌.

kodali nani village result, మంత్రి కొడాలి నాని సొంతూరిలో సంచలన ఫలితం.. పండగ చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు! - tdp back candidate anusha won in minister kodali nani native village yalamarru ...

గ‌త ఎన్నిక‌ల్లో దేవినేని అవినాష్ పోటీ చేసిన‌ప్పుడు.. ఆయ‌న‌పై నాన్‌లోక‌ల్ ముద్ర‌వేశారు. స‌హ‌జంగా ఇది వైసీపీ చేయాల్సిన ప్ర‌చారం కానీ.. ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు .. క్షేత్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పార‌నే వాద‌న ఉంది. దీంతో ఏకంగా 19 వేల ఓట్ల తేడాతో అవినాష్ ఓడిపోయారు. అంటే.. తేడా మాత్రం స్వ‌ల్పంగా క‌నిపిస్తోందంటే.. టీడీపీ నేత‌లు బ‌లంగా ఇక్క‌డ వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇలాంటివారి విష‌యంలో ఇప్ప‌టికైనా..చంద్ర‌బాబు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తారో .. లేదో చూడాల‌ని అంటున్నారు.