సినిమా ప్రేమికులకు శుభవార్త… రూ. 75 కే ఐనాక్స్, PVR సినిమా షో ఆఫర్స్!

సినిమా అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. వీకెండ్ వచ్చిందంటే.. ఖచ్చితంగా ఒక్క సినిమా అయినా చూడాలని అనుకుంటాము. ఇంకొంత మంది రిలీజైన ఫస్ట్ డేనే తన అభిమాన నటుడి సినిమాను చూడాలని కలలు కంటూ వుంటారు. అంత ఇష్టం మనకు సినిమా అంటే. అయితే.. మన ఇంటి సమీపంలో వున్న థియేటర్ కి వెళ్లి చూడటం వేరు, పెద్ద పెద్ద మాల్స్ అని చెప్పబడుతున్న ఐనాక్స్, PVR వంటి మాల్స్ లలో సినిమాలు చూడటం వేరు. అయితే ఈ మాల్స్ లో ధరలు అత్యధికంగా ఉండటం వలన చాలామంది ఇక్కడ సినిమా అంటే పెదవి విరుస్తారు. అవే ధరలు మనకు అందుబాటులోకి వస్తాయంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి?

అవును… మన దేశంలో సెప్టెంబర్ 16 ను జాతీయ సినిమా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. శుక్రవారం నాడు.. ఒక్కరోజు మాత్రం అనేక నగరాల్లో PVR, ఐనాక్స్ లలో కేవలం రూ. 75కే మూవీని చూసే అవకాశం కల్పిస్తున్నారు. MAI (మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకులకు “ధన్యవాదాలు”గా ఈ ఆఫర్ ప్రకటించింది. ఒక రోజు మాత్రమే తగ్గింపు 4,000 కంటే ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు వచ్చే థియేటర్లలో ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.

అయితే ఇంకా జాతీయ సినిమా దినోత్సవం కోసం అధికారిక వెబ్‌సైట్ ఎలాంటి పరిమితులను జాబితా చేయలేదు. ఫార్మాట్ లేదా భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమా ధర ఒకే విధంగా ఉంటుందని పేర్కొంది. అయితే.. రణబీర్ కపూర్, అలియా భట్ సారథ్యంలో రానున్న బ్రహ్మాస్త్ర వంటి హిందీ, తమిళం, తెలుగు, ఇతర భారతీయ చలనచిత్ర పరిశ్రమలకు చెందిన టైటిల్‌లతో సహా భారతీయ థియేటర్లు స్థానిక ఛార్జీలపై ప్రభావం కనపడుతున్నట్లు తెలుస్తోంది. ముందే చెప్పినట్లుగా, ఇంకా BookMyShow, PVR, INOX మరియు Cinépolis ఇంకా తమ వెబ్‌సైట్‌లను అప్‌డేట్ చేయాల్సి వుంది.

Share post:

Latest