గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఆ పవర్‌ఫుల్ హీరో కమింగ్..?

ఇంటెన్స్‌ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ దసరా పండుగ సందర్భంగా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ఇచ్చింది కాబట్టి గాడ్ ఫాదర్‌తో హిట్ కొట్టడం చిరంజీవికి కంపల్సరీగా మారింది. అందుకే సినిమాపై ప్రేక్షకుల్లో వీలైనంత అంచనాలు పెంచాలని చిరు చాలా ప్లాన్స్‌ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌. ఇది కొత్త కథ కాక పోవడంతో దీనిపై అంతగా హైప్స్ లేవు. ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి ఒకే ఒక్క ఈవెంట్‌తో గాడ్ ఫాదర్ మూవీ గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలనుకున్నారు. అందుకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఓ పవర్ ఫుల్ గెస్ట్‌ను తీసుకురావాలని ప్లాన్ చేశారట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్, సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. కాగా ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రెండు వారాల క్రితం విడుదల అయిన టీజర్‌లో చిరంజీవి లుక్ తప్ప కొత్తగా కనిపించింది ఏమీ లేదు. దాంతో అభిమానులు ఇప్పటికే పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది.

ఈ మూవీని తెలుగులోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ఒక పవర్‌ఫుల్‌ గోస్ట్ రోల్‌లో నటింపజేశారు. మూవీ నిర్మాతలు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ఒక మాస్ నంబర్‌ను సైతం చిత్రీకరించారు. నయనతార, సత్యదేవ్, బిజు మీనన్, అనసూయ, గద్దర్, మురళీ మోహన్, గంగవ్వ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

Share post:

Latest