గొడవకు సిద్ధమవుతున్న గాడ్ ఫాదర్ బయ్యర్స్.. అసలేమైందంటే..?

తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ప్రముఖ మలయాళం హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్.. ఈ సినిమాకు రీమేక్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో మొదలు పెట్టకపోవడంతో సినిమాను భారీ మొత్తానికి కొలుగోలు చేసిన బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన గత చిత్రం ఆచార్యతో నిరాశపరిచినా కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది.

ఇకపోతే చిరంజీవి కూడా ఆచార్య సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని గాడ్ ఫాదర్ బయ్యర్లకు న్యాయం చేయాలని దృష్టిలో ఆయన ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. ఈ స్థాయిలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయడం లేదని ఇప్పుడు బయ్యర్లు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ తప్పితే పెద్దగా హడావిడి లేదు. ఇక ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మెగా అభిమానుల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చాలా బద్ధకంగా ఈ విషయంలో ప్రవర్తిస్తున్నాడు అంటూ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదల చేయకుండా కొద్దిపాటి అంచనాలతోనే ఈ సినిమా విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం లేదు అని తెలుస్తోంది. కానీ ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా జరపడానికి సెప్టెంబర్ 28 సాయంత్రం 6 గంటలకు అనంతపూర్ లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే రోజున నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా కూడా విడుదల కానుంది. ఈ రెండింటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.

Share post:

Latest