ఇండ‌స్ట్రీలో పెళ్లి పీట‌లు ఎక్కుతోన్న మ‌రో క‌పుల్స్‌…!

బాలీవుడ్ లో మరో ప్రేమ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. `మస్తాన్` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రిచా చద్దా బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ తో ఆరేళ్లగా డేటింగ్ లో ఉందన్న విషయం తెలిసింది. అయితే రిచా, అలీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద‌రూ ప్రేమలో మునిగి తేలుతూ.. చెట్టపట్టాలు వేసుకుని చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకుని ఒక్కటిగా అవ్వ‌ల‌ని నిర్ణ‌యించుకున్నారు.

గత ఏడాది ఏప్రిల్ లోనే వీరిద్దరి వివాహం జరగవలసినది కానీ కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయింది. అయితే ఇక ఈ ఏడాది మార్చిలో పెళ్లికి ప్లాన్ చేసుకోగా ఇద్దరు షూటింగ్ లతో బిజీగా ఉండడం కారణంగా పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు అంటే ఈ రెండు వారాల్లో ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

ఇక రిచా,అలీల పెళ్లి వేడుకలు ముంబైతో పాటు ఢిల్లీలోనూ జరగనున్నాయని టాక్ వైర‌ల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఆలీ ఓ వైపు బాలీవుడ్ తో పాటు మరో వైపు హాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్టులో నటిస్తున్నాడు. అలాగే రీచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తుంద‌ట‌.

Share post:

Latest