డాక్టర్ బాబు భార్యతో మళ్ళీ గొడవకు దిగాడు… కొంపదీసి కథ మొదటికి రాదుకదా?

బుల్లితెర శోభన్ బాబు ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నిరుపమ్ పరిటాల. అవును, బుల్లితెరలో ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరుపమ్ మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ‘డాక్టర్ బాబు’ అనే పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్ అప్పటి నుండి బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. కొంతకాలం సీరియల్లో కార్తీక్, దీప, మోనిత పాత్రలు కనిపించకపోవడంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయిన సంగతి విదితమే.

దీంతో వీరు మళ్లీ రంగంలోకి దిగి కథ నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో గతం మర్చిపోయిన డాక్టర్ బాబుగా నిరుమ్ నటిస్తున్నాడు. ఇకపోతే నిరుపమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా వుంటాడో చెప్పాల్సిన పనిలేదు. కాగా కొంతకాలం క్రితం తన భార్య మంజులతో కలిసి సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు నిరుపమ్. యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి హోమ్ టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, మేకప్ వీడియోస్, షూటింగ్ కి సంబంధించిన వీడియోలను అలాగే వారి ఇంట్లో జరిగి ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా వినాయక చవితి సందర్భంగా వారింట్లో జరుపుకున్న వినాయకుడి పూజకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేశారు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో కూడా నిరుపమ్ తన భార్య మీద పంచులు వేశాడు. ఈ వీడియోలో మంజుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ వుండగా నిరుపమ్ ఏదో పని చేస్తు చూసావా ఎన్ని పనులు చేశానో? అని అనగా .. ఇవన్నీ నువ్వే చేశావా? అని మంజుల అంటుంది. దీంతో మగాడి కష్టం మీరు ఎప్పటికి గుర్తించరు! అంటూ బాధ పడతాడు. కాగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share post:

Latest