సీతారామం హీరో నీ అవమానపరిచింది ఎవరో తెలుసా..?

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో అయినప్పటికీ అందులో జెమినీ గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. ఇక ఇందులో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటనకు సినీ ప్రేక్షకులు సైతం మంత్ర ముగ్ధులు అయ్యారు. ఇక ఇటీవలే సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించారు దుల్కర్ సల్మాన్.

Mammootty turns photographer for son Dulquer Salmaan | Malayalam Movie News  - Times of India

అంతేకాకుండా కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాగానే రాబట్టింది. సౌత్ ఇండస్ట్రీలో దుల్కర్ సన్మాన్ కు ప్రత్యేకమైన స్థానం ఏర్పరిచింది ఈ చిత్రమని చెప్పవచ్చు. ప్రస్తుతం డైరెక్టర్ ఆర్ బాల్కి దర్శకత్వంలో “చుప్ రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ “అనే సినిమాలో నటిస్తున్నారు. చెడు విమర్శలు ఎదుర్కొన్న ఒక కళాకారుడు బాధను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం రొమాంటిక్ సైకాలజికల్ థ్రిల్లర్ ఈ చిత్రంగా తిరగకెక్కించడం జరుగుతోందట.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఆంగ్ల పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆరంభంలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా చేశారని తన నటన సరిగ్గా లేదని రివ్యూలు ఇచ్చే వారిని తెలిపారు. దాంతో తనకి చాలా అవమానంగా అనిపించింది అని కూడా తెలియజేశారు కొన్నిసార్లు ప్రజలు నేను సినిమాలు మానేయాలని కూడా వారు కోరుకున్నట్లు తెలియజేశారు. తన నటన కోసం తయారు చేయబడలేదని అందుకే తను ఇండస్ట్రీలో ఉండకూడదని డిసైడ్ అయ్యాడట దుల్కర్ సల్మాన్. ఇలాంటివి కామెంట్ చేస్తూ ఉండడం వల్ల చాలా బాధపడ్డాను అని తెలియజేశారు. ప్రస్తుతం హీరో గానే కాకుండా సింగర్ గా కూడా రాణిస్తున్నారు దుల్కర్ సల్మాన్.

Share post:

Latest