మొదటి భార్య మీద ప్రేమతో చివరి శ్వాస వరకు కృష్ణంరాజు ఏం చేశారో తెలుసా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎట్టకేలకు 2022 సెప్టెంబర్ 11 ఉదయం 3:25 గంటల సమయంలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఇకపోతే నిన్న మధ్యాహ్నం సమయంలో కనక మామిడి తోటలో ఆయనకు దహన సంస్కారాలు పూర్తి చేశారు. కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ ఒక్కసారిగా ఒంటరి వాడయ్యాడు. దుఃఖంలో ఉన్న ప్రభాస్ ను ఆపడానికి ఎవరివల్ల కాలేదని చెప్పాలి. ఇక ఆయన భార్య శ్యామలాదేవి కూడా భర్త పాడేమోసి ఆయనపై తనకున్న ప్రేమను నిరూపించుకుంది.ఇదిలా ఉండగా తాజాగా కృష్ణంరాజుకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది.

Krishnam Raju wife Shyamala Devi to contest from Janasena?

కృష్ణంరాజుకు ఇద్దరు భార్యలు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఆయన మొదటి భార్య సీతాదేవి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇకపోతే కృష్ణంరాజుకు తన మొదటి భార్య సీతాదేవి అంటే ఎంత ఇష్టమో ఆయన చివరి శ్వాస విడిచే వరకు ఆ ఇష్టాన్ని అలాగే చూపించారు. ఇకపోతే భార్య మీద ప్రేమతో కృష్ణంరాజు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీతాదేవి మరణించిన తర్వాత ఒంటరివాడైన కృష్ణంరాజును చూడలేక బంధువుల సలహాతో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు. అయితే రెండో పెళ్లి జరిగినప్పటికీ మొదటి భార్యతో ఉన్న ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలను ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు.

Krishnam Raju First Wife: Background of Krishnam Raju's first wife? If only  she knew how she died! | Krishnam Raju No More: Rebel Star Krishnam Raju  First Wife Details

ఇకపోతే మొదటి భార్య సీతాదేవికి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణంరాజు చివరి శ్వాస వరకు అదే పని చేశారు. అసలు విషయం ఏమిటంటే కృష్ణంరాజు కుటుంబం రాజుల కుటుంబం అని అందరికీ తెలిసిందే. ఇక సీతాదేవికి అన్నం తినేటప్పుడు మొదటి మధ్య దేవుడికి పెట్టే అలవాటు ఉందట. ఇక పెళ్లయ్యాక కృష్ణంరాజు కూడా భార్య అలవాటును నేర్చుకున్నాడు. ఇక సీతాదేవి చనిపోయాక కూడా ఆయన సీతాదేవి నేర్పించిన పద్ధతి మాత్రం మరిచిపోలేదు.. ఇక ఇంట్లో ఉన్నా.. ఫంక్షన్లకు వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా సరే మొదటి ముద్ద తీసి పక్కన పెట్టేవారట కృష్ణంరాజు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు.

Share post:

Latest