ఈ శ్రీసత్య కు..హీరో రామ్ తో ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కోట్లాది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి ఈ షోలో ఎవరు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారా అంటూ క్యూరియాసిటీతో వెయిట్ చేసిన జనాలకు బిగ్ బాస్ నిరాశనే మిగిల్చాడు. ఎందుకంటే ఈ షోలో పాపులర్ అయిన చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఉన్నవాళ్లలో అందరికన్నా జనాలకి తెలిసిన ముఖాలు జబర్దస్త్ కమెడియన్ చంటి, లేడీ కంటెస్టెంట్ ఫైమా, టాప్ సింగర్ రేవంత్ ఈ ముగ్గురు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ డమ్మీ లు అంటున్నారు నెటిజన్స్.


కాగా మొదటి రోజు నుంచే హౌస్ లో ఒక కంటెస్టెంట్ అభిమానులను స్పెషల్ అట్రాక్షన్ తో ఆకర్షిస్తుంది. ఆమె మరెవరో కాదు శ్రీ సత్య. నిజానికి ఈ పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. చెప్పుకోతగ్గ సినిమాలు కూడా చేయలేదు. కానీ హౌస్ లో మాత్రం తనదైన స్టైల్ లో అలరిస్తూ కవ్విస్తుంది . మిగతా కంటెస్టెంట్లు అందరూ నోరు పారేసుకుని మాట్లాడుతుంటే.. శ్రీ సత్య మాత్రం మైండ్ తో గేమ్ ఆడుతుంది అంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే అమ్మడుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శ్రీ సత్య అమ్మడుది విజయవాడ అందుకే అంత టాలెంటెడ్ అంత ఓపిక అంటారు జనాలు. స్టడీస్ మొత్తం విజయవాడలోనే కంప్లీట్ చేసింది.. డాక్టర్ కోర్స్ కూడా జాయిన్ అయింది. కానీ సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో మోడలింగ్ చేయాలని చదువులు మధ్యలోనే ఆపేసి సినీ రంగంలోకి వచ్చింది. కెరియర్ మొదట్లో పలు మోడలింగ్ షాట్స్ కు హాజరైంది. ఆ తర్వాత మిస్ విజయవాడ టైటిల్ గెలుచుకుంది . ఆ తర్వాత మిస్ ఆంధ్రప్రదేశ్ కూడా గెలుచుకుంది. దీంతో సినిమాలోని కొందరు డైరెక్టర్స్ కళ్ళు అమ్మడుపై పడ్డాయి.

అయితే ఈ క్రమంలోనే తన సినీ కలలు నెరవేర్చుకోవడానికి టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన సొంత బ్యానర్స్ పై శ్రీ స్రవంతి మూవీస్ లో రూపొందించిన “నేను శైలజ” అనే సినిమా ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేసింది . నిజానికి ఈ సినిమాలో శ్రీ సత్య చేసింది చాలా చిన్న పాప్తే.. కానీ ఆమె ఈ పాత్రను ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది.

ఎందుకంటే ..”తన సినీ ప్రస్ధానాన్ని మొదలుపెట్టింది హీరో రామ్ అని నేను ఎన్ని జన్మలకైనా మర్చిపోనని” శ్రీ సత్య చెప్పుకు రావడం గమనార్హం. ఆ తర్వాత “లవ్ స్కెచ్, గోదారి నవ్వింది” వంటి చిత్రాలలో నటించింది. పలు వెబ్ సిరీస్ చేసింది . పలు సీరియల్ లో నటించింది. కానీ సినిమాల్లో రాని గుర్తింపు పాపులారిటీ సీరియల్ లో వచ్చింది . ఆ పాపులారిటీతోనే ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. మరి చూడాలి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో ఎన్ని వారాలు ఉంటుందో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో..?

Share post:

Latest