బన్నీ – సుక్కు కాంబినేషన్లో వచ్చిన మొదటి షార్ట్ ఫిలిం ఏంటో మీకు తెలుసా..?

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటోంది. అందుకే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ సినిమాల ద్వారా మొదలవ్వకముందే ఒక షార్ట్ ఫిలిం ద్వారా మొదలైంది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. మరి సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి షార్ట్ ఫిలిం ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Sukumar to direct Allu Arjun again, this time for advertisement not for  Pushpa

ఇకపోతే వీరి కాంబినేషన్లో వచ్చిన షార్ట్ ఫిలిం కేవలం మూడు నిమిషాల నిడివి మాత్రమే ఉందని, ఈ షార్ట్ ఫిలిం కి అల్లు అర్జున్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. మరి ఈ షార్ట్ ఫిలిం లో..” మన కర్తవ్యాలు నిర్వర్తించడం కూడా దేశభక్తి అవుతుంది.. మార్పు మనతోనే మొదలవుతుంది.. ఆ మార్పు నేనే అంటూ” బన్నీ చెప్పిన డైలాగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం అప్పట్లో బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ షార్ట్ ఫిలిం తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఆర్య కావడం విశేషం. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది

ఆ తర్వాత ఆర్య సీక్వెల్ ఆర్య 2 వచ్చినా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతోంది.. పుష్ప 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్రం యూనిట్ వెల్లడించింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest