ఘోస్ట్ సినిమాకి నాగార్జున అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ పనులు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ వస్తోందని చెప్పవచ్చు. నాగార్జున సరసన హీరోయిన్గా సోనాల్ చౌహన్ నటించినది. ఈ సినిమాకి దర్శకత్వం డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ వహిస్తున్నారు. ఈ చిత్రంలో సురేంద్రన్, గుల్ పనాగ్ లు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

The Ghost Movie: The Ghost Romantic Song, which is fast-paced!
ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. అయితే ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాకు నాగార్జున ఎంతటి రెమ్యూనరేషన్ అందుకున్నాడు అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఈ సినిమాకి నాగార్జున దాదాపుగా రూ.6 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రాపర్టీ లో షేర్ కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత నాగార్జునకు అంతటి పెద్ద విజయం దక్కలేదని కూడా చెప్పవచ్చు. అయితే గతంలో నటించిన వైల్డ్ డాగ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లపరంగా అంతగా సక్సెస్ కాలేకపోయేది.

Watch: The Ghost Romance With Sonal - Movie News
ఇక తన కుమారుడితో బంగార్రాజు సినిమాతో అలరించగా ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆ సక్సెస్ ఊపుతోనే ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఏజ్ లో కూడా నాగార్జున ఇంతటి సాహసం చేస్తున్నారా అని అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి నాగార్జున ఈ సినిమాతో సక్సెస్ అవుతారేమో చూడాలి.