ఇంత బాధ‌లోనూ చిరు కోసం ద‌ర్శ‌కుడు బాబి సంచ‌ల‌న నిర్ణ‌యం…!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం మంచి హిట్ ను అందుకోలేకపోయాయి. మెగాస్టార్ 151 గా సినిమ‌గా వచ్చిన సైరా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ సినిమా కు మంచి టాక్ వ‌చ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా దారుణమైన ప్లాప్ టాక్ వ‌చ్చింది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉడ‌క‌పోవ‌డంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా చిరుకు భారీ హిట్ కావాల‌ని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

Chiranjeevi to play undercover cop in Chiru 154?- Cinema express

యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో వ‌స్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని ముగించుకొని. తాజాగా హైదరాబాదులో రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ బాబి తండ్రి కొల్లి మోహనరావు మృతి చెందారు. బాబీ తండ్రి చనిపోయిన 5 రోజుల అవకుండానే ఇంత బాధలో కూడా షూటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. బాబీపై టాలీవుడ్ వర్గాల వారు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.బాబీ షూటింగ్ చేయడానికి ముఖ్య కారణం బాబీ తండ్రి చిరంజీవి వీరాభిమాని.

Acharya actor Chiranjeevi accidentally reveals the title of his next film with director Bobby - Movies News

తన తండ్రి అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తున్న కొడుకు సినిమాను చూడకుండానే అయినా చనిపోవడం కొంచెం బాధాకరం. చిరంజీవి కూడా బాబీ తండ్రి చనిపోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు.ఇక బాబీ తన తండ్రి ఎంతగానో ఇష్టపడి చిరంజీవితో సినిమా తీసి మంచి హిట్ కొట్టి ఆయనకు అంకితం చేయాలని డైరెక్టర్ బాబీ భావిస్తున్నాడు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. చిరంజీవికి జోడిగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Share post:

Latest