చంద్రబోస్ గారిది ప్రేమవివాహం అని ఎంతమందికి తెలుసు? పైగా ఆమె 6 ఏళ్లు పెద్ద అట!

తెలుగు చిత్ర సీమలో చెప్పుకోదగ్గ నిన్నటి పాటల రచయితల్లో చంద్రబోస్ ఒకరు. తన అద్భుతమైన లిరిక్స్ తో సాహిత్య ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంటారు. ఇప్పటికే కొన్ని వందల పాటలను రాసిన చంద్రబోస్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలియదనే చెప్పుకోవాలి. ఎందుకంటే హంగు ఆర్భాటాలకు ఇతను కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఇకపోతే అతని వ్యక్తి గత జీవితానికి వస్తే, ఆయన పెళ్లి ఒక సినిమా కథని తలపిస్తుంది అనడంలో సందేహం లేదు.

బేసిగ్గా వరంగల్ కి చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. స్నేహితుడి ద్వారా ‘తాజ్ మహల్’ అనే సినిమా కోసం పాటలు రాసే అవకాశం రావడంతో ఇక అతని చదువు అటకెక్కింది. సాధారణంగా ఇతనికి సాహిత్యం పట్ల వున్న మక్కువ సినిమాలవైపు అడుగులు వేసేలా చేసింది. ఇక తాజ్ మహల్ అనే సినిమాకు మంచి పేరు రావడంతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తరువాత అతను వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

ఇక అతని పెళ్లి విషయానికొస్తే, అది ఓ అందమైన ప్రేమకథ అని చెప్పుకోవాలి. ఆ కధని సినిమాగా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పెళ్లి సందడి సినిమా సమయంలోనే సుచిత్ర తో చంద్రబోస్ పరిచయమైంది. బేసిగ్గా కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర, పాటల రచయిత అయిన చంద్రబోస్ తో ‘పెళ్లి పీటలు’ అనే సినిమాకు కూడా కలిసి పని చేశారు. ఆ సినిమా కోసం హైదరాబాదు నుండి చెన్నైకి విమానంలో పక్క పక్క సీట్లో కూర్చొని ప్రయాణం ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది.. కొన్నాళ్లకు చంద్రబోస్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

కానీ వయసులో చంద్రబోస్ కంటే సుచిత్ర 6 సంవత్సరాలు పెద్ద.. దాంతో కాస్త వీళ్ల పెళ్ళికి ఇబ్బందులు తలెత్తాయి. అయినా చంద్రబోస్ పట్టుదలతో తాను కోరుకున్న సుచిత్రను పెళ్లి చేసుకునేందుకే మొగ్గు చూపాడు. అతడి పట్టుదలని చూసి సుచిత్ర కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిజంగా వీళ్ళ ఇద్దరి ప్రేమ కథ సినిమా తీస్తే మంచి హిట్ అవుతుందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest