మాజీ ఎమ్మెల్యేకు హ్యాండ్..మాజీ నేతకు సీటు..?

తన సొంత జిల్లా చిత్తూరులో ఈ సారి పట్టు సాధించాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క కుప్పం సీటుని మాత్రమే గెలుచుకున్నారు. ఇంకా జిల్లాలో మిగిలిన 13 సీట్లని వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని..ఎలాగైనా జిల్లాపై పట్టు తెచ్చుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ పట్టు సాధించే దిశగా నేతల చేత పనులు చేయిస్తున్నారు. అయితే జిల్లాలో టీడీపీకి పట్టు పెరగలేదు. గట్టిగా తిప్పికొడితే నాలుగైదు సీట్లలో పార్టీ పరిస్తితి బాగుంది..మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు.

ఇదే క్రమంలో తంబళ్ళపల్లె నియోజకవర్గంలో కూడా టీడీపీ పరిస్తితి ఇబ్బందికరంగానే ఉంది. 2014లో ఇక్కడ టీడీపీ తరుపున శంకర్ యాదవ్ గెలిచారు..2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వైసీపీ తరుపున పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పటికీ అక్కడ ద్వారకానాథ్ స్ట్రాంగ్ గా ఉన్నారని సర్వేల్లో తెలిసింది. అటు టీడీపీ నేత శంకర్ యాదవ్ పెద్దగా యాక్టివ్ గా పనిచేయట్లేదు. అసలు ఓడిపోయాక అడ్రెస్ లేదు. కానీ ఆ మధ్య బాబు క్లాస్ పీకడంతో అప్పుడప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా సరే శంకర్‌పై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఆయన్ని ఖచ్చితంగా మార్చాలనే డిమాండ్ చేస్తున్నారు.

దీంతో చంద్రబాబు కూడా శంకర్‌ని మార్చడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి సీటు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వేలు కూడా చేయిస్తున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ ఫ్యామిలీ గతంలో టీడీపీలో పనిచేసింది. ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో కూడా ప్రవీణ్ కూడా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014 ఎన్నికల ముందు ప్రవీణ్ వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు.

2019లో ప్రవీణ్‌కు వైసీపీ సీటు ఇవ్వలేదు. దీంతో ప్రవీణ్ వైసీపీకి దూరమయ్యారు..కానీ సొంతంగా రాజకీయం చేస్తున్నారు..నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నారు. అలాగే టీడీపీ నేతలు ఎవరైనా చనిపోతే వారి ఇళ్లకు వెళ్ళి పరమర్శితున్నారు. అటు లక్ష్మీదేవమ్మా..ఇటు ప్రవీణ్..నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న శంకర్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో శంకర్‌ కంటే ప్రవీణ్‌కు సీటు ఇస్తే బెటర్ అని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. బాబు కూడా పరిస్తితులని చూసుకుని ప్రవీణ్‌ని టీడీపీలోకి తీసుకొచ్చి సీటు ఇస్తారని ప్రచారం ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Share post:

Latest