వామ్మో, అది ఎన్టీఆర్ వల్ల అయ్యే పనేనా.. ఇది అస్సలు ఊహించని ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్లలో జూనియర్ ఎన్టీఆర్ పై వరుసలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన ముఖంలో హావభావాలు కనిపించడంతో పాటు ప్రతి సినిమాకి కొత్త అవతారంలో మెరిసిపోతూ అభిమానులు ఖుషి చేస్తుంటాడు. కంత్రీ, యమదొంగ, అదుర్స్, ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో వంటి రకరకాల సినిమాలో అతడు సరి కొత్తగా కనిపించాడు. ఇక జైలవకుశలో మూడు పాత్రల్లో ఒకేసారి చేసి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ కొమరం భీమ్‌గా అదరగొట్టాడు.

అయితే ట్రిబులార్ సినిమా విడుదలైన తర్వాత తారక్ చాలా బరువు పెరిగాడు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతడెంత బొద్దుగా తయారయ్యాడో అందరం చూశాం. ఈ ఈవెంట్లో అతన్ని చూసి ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. సింహాద్రి, రాఖీ వంటి సినిమాలు తీసే సమయంలో కుర్రాడిగా ఉన్నాడు కాబట్టి వెంటనే బరువు తగ్గాడు మళ్లీ ఇప్పుడు బరువు తగ్గడం అతని వల్ల అయ్యే పనేనా అని చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

అయితే వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ ఈ హీరో ఇప్పుడు సన్నగా తయారయ్యి డాషింగ్‌ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. కొద్ది రోజుల క్రితం బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న తారక్ నెల రోజుల క్రితం తో పోలిస్తే చాలా సన్నగా మారాడు. కేవలం 30 రోజుల సమయంలోనే తారక ఇంతలా బక్కగా అవుతాడని ఫ్యాన్స్ కూడా అస్సలు ఊహించలేదు.

ఎన్టీఆర్ కెరీర్‌లో ఇలాంటి శారీరక మార్పులు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ హీరో యమ దొంగ సినిమా కోసం తొలిసారి సన్నగా మారాడు. తరువాత అతను కంత్రి కోసం యమ స్లిమ్ అయ్యాడు. దమ్ములో బొద్దుగా కనిపించినా బాద్షాలో సన్నగా కనిపించాడు. ఈ సినిమాలన్నీ వరుసగా వచ్చినవే. అలా ప్రతి సినిమాకి అతను తన శరీరాన్ని పూర్తిగా మార్చుకుంటూ సినిమాల పట్ల తన డెడికేషన్‌ను చాటుతున్నాడు. ఇక 2015లో టెంపర్‌ మూవీలో సిక్స్‌ప్యాక్‌ బాడీ షో చేసి కేక పుట్టించాడు. ఇదిలా ఉండగా అతను తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ 30లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ లుక్‌లో కనిపించనున్నాడని వినికిడి.

Share post:

Latest