బొయికాట్ ని ఛేదించి,రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్న రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రం…

రణబీర్ కపూర్,అలియా భట్ జంట గ నటించిన బ్రహ్మాస్త్రం సినిమా భారీ ఎక్సపెక్టషన్స్ మధ్య విడుదల అయింది.ఇందులో అమితాబ్ బచ్చన్,నాగార్జున ప్రత్యేక పాత్ర లో నటించారు. ఈ సినిమా విడుదలయిన వెంటనే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.నిదానంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో బాగానే వసూలు చేయటం మొదలుపెట్టింది…ఇక వీకెండ్ లో మాత్రం బాగా వసూలు చేసి కొన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది కూడా.అసలే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో విడుదలయిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.అయితే బ్రహాస్త్రం మాత్రం మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది.

వీకెండ్ వసూళ్ల విషయం లో రణబీర్ కెరీర్ లో నే బ్రహ్మాస్త్రం ఒక పెద్ద ఓపెనర్ గ నిలించింది.రన్బీర్ నటించిన సంజు సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్ రాబట్టింది.అలియా భట్ కి కూడా ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వున్నా సినిమా..ఇంకా బ్రహ్మాస్త్రం కలెక్షన్స్ వరల్డ్ వైడ్ కూడా బాగా ఉండటం బాలీవుడ్ కి కొంచెం ఊరటనించ్చింది అని చెప్పొచ్చు.ఇంకా ఓపెనింగ్ కలెక్షన్స్,వీకెండ్ కలెక్షన్స్ విషయం లో బూల్ బుల్లయ్య2 ,ఇంకా సూర్యవంశీ ల రికార్డు బ్రేక్ చేసింది.రన్బీర్ సినిమా సంజు రికార్డు కూడా బ్రేక్ చేసింది బ్రహ్మాస్త్రం.బాలీవుడ్ లో కరోనా తర్వాత ఇంత రేంజ్ వసూళ్లు చేసిన చిత్రం కూడా ఇదే కావటం గమనార్హం.

అసలే హిట్స్ లేక విలవిలాడుతున్న బాలీవుడ్ కి ఈ సినిమా ఆశాకిరణం ల కనిపిస్తోంది.ఇప్పటి వరకు బ్రహ్మాస్త్రం బాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లో కూడా బాగానే దూసుపోతుంది.అయితే ఓపెనింగ్ లో హీరో హీరోయిన్స్ తో పాటు,అమితాబ్,నాగ్ ల క్రేజ్ ఇంకా గ్రాఫిక్స్ తో వీకెండ్ వరకు బాగానే సాగిన ఈ బ్రహ్మాస్త్రం మరి లాంగ్ రన్ లో ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి మరి.

Share post:

Latest