బ్రహ్మాస్త్ర..ఈవెంట్ రద్దు కారణంగా అన్ని కోట్లు నష్టమా…?

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా తెలుగులో కూడా చాలా పాపులర్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ అమితాబచ్చన్, మౌని రాయ్, నాగార్జున తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త సినిమాని తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ వంటి బాషాలలో రాజమౌళి సమర్పిస్తూ ఉండడం జరుగుతోంది. ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది. ఇక రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.Will "Brahmastra" Movie Release On Disney+ Hotsar Platform??? Here's All  You Need To Know About The Movie Updates So far!

బ్రహ్మాస్త్ర సినిమాని సెప్టెంబర్-9 వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు చిత్రబంధం అందుకోసం ప్రమోషన్లలో భాగంగా హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో అభిమానులు మరియు మీడియా మిత్రుల సమక్షంలో గ్రాండ్గా ఫ్రీ రిలీజ్ వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని.. చిత్రబంధం ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమా ఈవెంట్ కు భారీ ఎత్తున ప్లాన్ చేశారు రాజమౌళి తన కుమారుడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు ,అక్కినేని అభిమానులు, రాజమౌళి అభిమానులు పెద్ద సంఖ్యలో రామోజీ ఫిలిం సిటీకి చేరుకోవడం జరిగింది.

దీంతో భద్రతా సమస్యల కారణం చేతను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు మొత్తం అక్కడే ఉండడంతో ఈవెంట్ కు ఎలాంటి భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు ఈ వేడుకకు అనుమతించలేదు. దీంతో అభిమానులు మొత్తం తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే నివేదికలో కొంతమంది తెలియజేసిన ప్రకారం.. ఈ ఈవెంట్ కోసం చిత్ర మేకర్.. రూ.2.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడం చేత ఇదంతా వృధా అయిందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.