బిగ్‌బాస్ 6లో ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ ఎవ‌రో తేలిపోయింది…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం నామినేషన్స్ కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే మొదటి వారంలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిని సస్పెన్స్ లో ఉంచి.. చివరి వరకు ఆ సస్పెన్స్ ను కంటిన్యూ చేసి చివరకు ఏ ఒక్కరిని ఎలిమినేట్ చేయడం లేదు అంటూ నాగార్జున షాకింగ్ కబురు చెప్పి వెళ్లి పోయాడు. తొలివారంలోనే ఎలిమినేషన్ ఎత్తేయ‌డానికి కార‌ణం..కంటెస్టెంట్స్‌కి మరో అవకాశం ఇద్దాం అని. నిజానికి మొద‌టివారంలో ఎవరి టాలెంట్ ఏంటో,వారి వ్యక్తిత్వం ఏంటో బయటపడే అవకాశం లేదు కాబట్టి.. అందుకే మరో వారం వ‌ర‌కు హౌస్‌లో ఉండే అవకాశం బిగ్ బాస్ వారికి ఇచ్చారు.

Bigg Boss Telugu 6 Elimination Today, Nominated Contestants Of The Week

ఇక రెండవ వారంలో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ఒక తార‌స్థాయిలో జ‌రిగింది. అయితే ఈ ప్ర‌క్ర‌య‌లో 8 మంది కంటెస్టెంట్స్‌లు నామినేట్ అయ్యారు. వారిలో మెరీనా & రోహిత్, రేవంత్, గలాటా గీతు, ఆదిరెడ్డిరాజ, శేఖర్అభినయ, శ్రీఫైమా, షానీ సాల్మన్ నామినేట్ అయ్యారు. అయితే ఎక్కువ మంది గలాటా గీతుని టార్గ‌ట్ చేసారు. అయితే ఈ ఎనిమిది మందిలో ఎవరు ఫ‌స్ట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది నేడు రాత్రి వరకు వేచి చూడాలి. అయితే ఇద్దరి పేర్లు మాత్రం చాలా ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

bigg boss 6 telugu contestants remuneration List | bigg boss telugu season 6 contestants remuneration | bigg boss telugu 6 contestants salary - Filmibeat

ఇప్పటికే ఓటింగ్ పక్రియ క్లోజ్ అయ్యింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో రేవంత్ కి అత్యధికంగా ఓట్లు పడ్డాయి అని సమాచారం అందుతోంది. ఆ త‌రువాత అత్యధిక ఓట్లను ఫైమా పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాబ‌ట్టి వీరిద్ద‌రూ సేఫ్ అని తెలుస్తుంది. అయితే ఓట్లు అధికంగా దక్కించుకున్న వారిలో గీతూ మరియు ఆదిరెడ్డి లు కూడా ఉన్నారు. ఇక మెరీనా-రోహిత్ మరియు రాజశేఖర్ కూడా మంచి ఓట్లు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన వారు అభినయ మరియు షానీ సాల్మన్ లే డేంజర్ జోన్ లో ఉన్నారు.

Bigg Boss Telugu 6, Bigg Boss 6, BB Telugu 6, King Nagarjuna, BB Telugu season 6, Bigg Boss Season 6, Star Maa Bigg Boss 6 – FilmiBeat

ఇక వీరిద్దరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని మరి కాసేపట్లో అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మొద‌టివారం ఎలిమినేషన్స్ లేవు కాబ‌ట్టి .. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎవ‌రు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్న‌ది ఈ రోజు వ‌చ్చే ఎపిసోడ్ లో తెలియ‌నున్నది.

Share post:

Latest