యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంతో ఫైర్ అవుతున్న బాలయ్య..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ సిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. ఈ విషయం పేను సంచలనంగా మారుతోంది. దీంతో టీడీపీ నేతలు సైతం ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయమై ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సానుకూలంగానే స్పందించడం జరిగింది.

When Balakrishna differed with his legendary father | cinejosh.com
అయితే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ విషయంపై ఫైర్ అవుతూ ఫేస్ బుక్ లో ఒక పోస్టును చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య రాష్ట్రకొస్తూ మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది ఒక పేరు మాత్రమే కాదు ఒక సంస్కృతి ఒక నాగరికత తెలుగుజాతికి వెన్నుముక అని తెలియజేశారు.. రాజశేఖర్ రెడ్డి సీఎం పదవి సాధించి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు.. కొడుకేమో ఇప్పుడు యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ తెలియజేశారు బాలకృష్ణ.

ఆ మహనీయుడు పెట్టిన దీక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు, పీతలు ఉన్నారు, విశ్వాసం లేని వారు కూడా ఉన్నారు అని తెలియజేశారు బాలకృష్ణ. ఇలాంటి సిగ్గులేని బతుకులు బతుకుతున్నారు అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు బాలకృష్ణ. ఇంతటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో వైసిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కోసం పలు పరిసర ప్రాంతాలలో ఉండడం వల్ల కాస్త ఆలస్యంగా స్పందించినట్లు సమాచారం.

https://www.facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.facebook.com%2FNandamuriBalakrishna%2Fposts%2F661546905327852&display=popup&ref=plugin&src=post

 

Share post:

Latest