అందమైన ప్రేమ కథ చిత్రం గా. స్వాతీ ముత్యం..ట్రైలర్..!!

గణేష్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. ఈ చిత్రంలో హీరోయిన్ వర్షా బోలమ్మ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్తో కుటుంబ కథాచిత్రంగా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజున ఒక సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

Bellamkonda Ganesh Babu's Swathi Muthyam Telugu Movie OTT Release Date, OTT  Platform, Time and more
ఇందులో భాగంగానే హైదరాబాద్ లో AMB సినిమా లో ఈవెంట్లు నిర్వహించారు. ఇక ఈవెంట్ కు చిత్ర బృందం సైతం పాల్గొనడం జరిగింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడంతో భారీగా అంచనాలు పెంచేసాయి. మొదట హీరోయిన్ సంభాషణలతో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో పడడం ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్తారా లేదా అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. అయితే వీరికి ఒక సమస్య ఎదురవుతుంది.. ఆ సమస్య ఏమిటి.. ఆ సమస్య నుంచి ఏలా బయట పడేందుకు హీరో హీరోయిన్ ఏం చేస్తారు అన్న కథ అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ను చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైర్మెంట్ గా కనిపిస్తోంది. డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నేను ముందుగా గణేష్ చెప్పాలి ఎందుకంటే ఈ స్టోరీ రాశాక నేను ముందుగా కలిసింది గణేష్ ని అని అయితే ఈ సినిమా అంగీకరించినందుకు చాలా ధన్యవాదాలు.ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రమని తెలియజేశారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest