పత్తా లేకుండా పోయిన స్టార్ హీరోల అల్లుళ్ళు..!!

మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇక మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ మెగా బ్రాండ్ తో ఎంట్రీ ఇవ్వగా అశోక్ గల సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా ఎంట్రీ ఇచ్చేముందు భారీగానే ప్రచారం జరిగింది. అయితే కళ్యాణ్ విజేత సినిమా ప్రచారం చేసిన ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఆ తర్వాత సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి ,కిన్నెరసాని వంటి సినిమాలు భారీ డిజాస్టర్లు మిగిలాయి.

Kalyaan Dhev: Sreeja Konidela: Kalyan Dev is still following Sreeja -  kalyaan dhev still follows sreeja konidela » Jsnewstimes
ఇక అశోక్ ఎంట్రీ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురైన సంగతి అందరికీ తెలిసిందే బ్యాకప్ ఉన్న కథ అయినప్పటికీ డైరెక్టర్ విషయంలో తడబాటు పడడంతో కాస్త డిజాస్టర్ గురయ్యారని చెప్పవచ్చు చివరకు ఎలాగోలా ఏడాది హీరో అనే సినిమాతో లాంచ్ అయ్యారు కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఏం చేస్తున్నారు .?ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియడం లేదు. మీడియా కూడా వీరిని పట్టించుకోలేదు.. వీరి ఇద్దరి సినిమాలు విడుదలై ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు వారి తదుపరిచిత్రానికి సంబంధించి ప్రాజెక్టు ప్రకటించలేదు.

Actor Ashok Galla Short Biography, Career and Movies - TFIPOST

బ్యాక్ గ్రౌండ్ లేని కొందరు హీరోలు బాగా దూసుకుపోతుంటే అన్ని రకాలుగా సపోర్టు ఉన్నప్పటికీ ఇద్దరు హీరోలు మాత్రం వెనకంజలో ఉన్నారని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఇద్దరు హీరోలు అంతగా కనిపించరు ఎలాంటి మేకవర్ ఫోటో షూట్ కూడా ఎప్పుడు కనిపించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా వెనుకబడితే చాలా కష్టమని పలువురు నెటిజన్లు సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరికొంతలు మాత్రం ఇద్దరు హీరోలు త్వరలోనే వారి యొక్క అప్డేట్లతో రాబోతున్నారు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Share post:

Latest