ఇంట్రెస్టింగ్: ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి భయపడ్డ బన్నీ..ఎందుకో తెలిస్తే నవ్వు ఆగదు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయ్యాక అన్ని సీన్స్ చేయగలగాలి. అప్పుడే హీరోగా మనం ముందుకు వెళ్ళగలం. జనాలను మెప్పించగలరు. నేను పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాను అలాంటి సీన్స్ చేయలేను అంటే కుదరదు. హీరో అన్నాక ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ను పండించాలి. అప్పుడే జనాలు అతనని హీరోగా గుర్తిస్తారు. అలా అన్ని క్వాలిటీస్ లో మెప్పించిన హీరో అల్లు అర్జున్.

కెరియర్ మొదట్లో డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిన అల్లు అర్జున్.. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా ఎంటరయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న బన్నీ ఆ తర్వాత నుంచి తన కెరీర్లో ప్రతి సినిమాను హిట్ కొట్టుకుంటూ వచ్చాడు . ఒకానొక టైంలో కొన్ని ఫ్లాప్ సినిమాలు చూసినా ..ఆ సినిమాలో ఆయన కనబరిచిన నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. రీసెంట్ గా పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న బన్నీ ..మరి కొద్ది రోజుల్లోనే పుష్ప 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ క్రమంలో బన్నికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ” ఉ అంటావా మామ ఊ ఊ అంటావా మావ “అంటూ ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ పాటలో సమంత ఎప్పుడు కనిపించనంత హాట్ గా కనిపించింది . అంతేకాదు బన్ని తొడపై కూర్చొని బన్నీని గిల్లుతూ వామ్మో ఆ హాట్ స్టెప్స్ చూస్తే మత్తులు పోవాల్సిందే. అయితే ఈ పాటలో మీకు గుర్తుంటే బన్నీ తొడపై సమంత కూర్చొని ఊపుతూ నడుము గిళ్లాల్సిన స్టెప్ ఒకటి ఉంటుంది .

అయితే ఈ స్టెప్ చెప్పగానే బన్ని కొరియోగ్రాఫర్ కి నో చెప్పారట. వద్దు వేరేది మార్చమన్నారట. కానీ సుకుమార్ బలవంతంగా స్టెప్ బావుంది చేయమని ఫోర్స్ చేశారట . కానీ నడుము గిల్లడానికి మాత్రం బన్నీ అస్సలు ఒప్పుకోలేదట. దీంతో సమంత కూడా పర్లేదు గిల్లు అంటూ ఎంకరేజ్ చేసిన కాని నో నో అంటూనే ఉన్నాడట. ఫైనల్ గా సుకుమార్ గట్టిగా చెప్పడంతో అప్పుడు ఆయన మాట కాదనలేక బన్నీ సమంత నడుము పై చెయ్యి పెడితే మనకి కెమెరాలో గిల్లిన్నట్లు చూయించాడు సుకుమార్. దీంతో ఈ పాట షూటింగ్ కంప్లీట్ అవ్వగానే బన్నికి సుకుమార్ దండం పెట్టేసాడట. నీతో వేగలం రా బాబు అంటూ ఫన్నీగా మాట్లాడారట. కాగా పుష్ప 2 సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది . మరి ఈ సినిమాలో బన్నీని ఎలా ఇబ్బంది పెడతాడో సుకుమార్ చూడాలి..?

Share post:

Latest