అంద‌గ‌త్తె ఐశ్వ‌ర్యారాయ్ ఆ జ‌బ్బుతో బాధ‌ప‌డుతోందా…. ఇంత క‌ష్టం వ‌చ్చిందా…!

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, మిస్ యూనివర్స్ గా కిరీటం గెలుచుకుని అందరికీ సుపరిచితమైంది. ఆమె అందచందాల గురించి ప్రత్యేకంగా ఎవ‌రికి చెప్పనవసరం లేదు..అప్పట్లో ఆమె అబ్బాయిల కలల రాకుమారిగా ఉండేది. ఐశ్వ‌ర్య ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కి కోడలిగా అభిషేక్ బచ్చన్ కి భార్యగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈ విశ్వ సుందరి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐశ్వర్య రాయ్ కి ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక 2010లో వచ్చిన రోబో సినిమాలో రజనీకాంత్ కి జోడిగా ఆడి పాడి అందరినీ ఆకట్టుకుంది. ఇక తర్వాత సౌత్ సినీ ఇండస్ట్రీ సినిమాల్లో కనిపించడం లేదు. ఇక చాలాకాలం తర్వాత తమిళ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ అనే మూవీలో హీరోయిన్గా నటిస్తోంది ఐశ్వర్య .

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ ఈవెంట్ మధ్యలోనే లేచి వెళ్ళిపోవ‌డానికి ఈ వ్యాధి కారణం అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సాధార‌ణంగా ఎవరికైనా కూడా చల్లని పదార్థాలు తింటే చాలామందికి జలుబు వస్తుందని.. నిమ్ము ఉంటుందని అంటారు. కానీ ఐశ్వర్య రాయ్ కి ఉన్న జబ్బు ప్రకారం చల్లటి పదార్థాలు తిన్నా,చల్లటి నీళ్లు తాగినా కూడా స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుందట.

అంతేకాదు శరీరం మొత్తం ఎర్రగా మారిపోయి.. ఇచ్చింగ్ మొదలై భయంకరమైన అలర్జీ వస్తుందట.
ఇక ప్రస్తుతం కూల్ వాటర్ , కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ వంటి చల్లని పదార్థాలు తాగకుండా ఎంతో జాగ్రత్త పడుతుందట. అయితే రీసెంట్ గా జరిగిన పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ ఈవెంట్లో అనుకోకుండా కూల్ వాటర్ తాగడంతో ఇబ్బంది మొదలైనట్లు అందుకే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఈవెంట్ జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయిందంట‌. ఐశ్వర్యకి మేకప్ కిట్ తో పాటు మెడికల్ కిట్ కూడా తప్పనిసరిగా ఈమెతో ఉండాల్సిందే..!

Share post:

Latest