మరోసారి ఆ అవతారంలో కనిపించనున్న రమ్యకృష్ణ..ఫ్యాన్స్ హ్యాపీ..!?

డిజిటల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన ఈ టైంలో డిజిటల్ మీడియాలో ఎన్నో ఓటీ టీ సంస్థలు వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో మంచి గుర్తింపుని కూడా సంపాదించుకున్నాయి.ఈ ఓటీటీ సంస్థలు అన్ని భాషల్లో ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అన్ని ఓటీటీలో ప్రత్యేకం సినిమాలో- వెబ్ సిరీస్ లో కాకుండా స్పెషల్ రియాల్టీ షోలను చేసుకుంటూ, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలతో దూసుకుపోతుంది.

aha in collaboration with Oak Entertainment launches the first look of 'Dance  Ikon' - MediaBrief

వీటితో పాటు సింగింగ్ కాంపిటేషన్ వంటి ప్రోగ్రామ్‌లు కూడా పెడుతూ, తెలుగు ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ అందిస్తుంది. తాజాగా ఆహా ఇప్పుడు సరికొత్త షో తో ముందుకు రాబోతుంది. ఆహా ఇప్పుడు డాన్స్ ఐకాన్ పేరిట ఒక డాన్స్ షోను మొదలు పెట్టనుంది. ఈ షోను సెప్టెంబర్ 11 నుంచి ఆ హాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో కోసం ఆహా టీం తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ప్రమోషన్‌లు కూడా వేగంగా చేస్తుంది. అయితే ఈ డాన్స్ ఐకాన్ షో కి జడ్జిలుగా శేఖర్ మాస్టర్ ఒకరు కన్ఫర్మ్ అయ్యారు, మరో జడ్జిగా సీనియర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ‌ కన్ఫామ్ అయినట్టుు తెలుస్తుంది.

Shivagami To Judge Aha's Dance Ikon - Movie News

రమ్యకృష్ణ సినిమాలో ఎంతో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తొలిసారిగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఒక షో కి జడ్జ్ గా కనిపించడం మొదటిసారి. గతంలో రమ్యకృష్ణ బిగ్ బాస్ ఓ ఎపిసోడ్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఇప్పుడు రమ్యకృష్ణ రెండోసారి పూర్తిగా ఒక షో కి న్యాయ నిర్ణీతగా వ్యవహరించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ షో కి వ్యాఖ్యాతగా ప్రముఖ యాంకర్ ఓంకార్ కొనసాగనున్నాడు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest