ఆ నాలుగేళ్లు నరకం చూసానంటున్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు..!!

చైల్డ్ యాక్టర్ గా వెండితెరపై సందడి చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో సుదీప కూడా ఒకరు. ఈమె సుదీప అంటే ఎవరు గుర్తుపట్టలేరు కానీ నువ్వు నాకు నచ్చావు చిత్రంలో పింకీ అంటే మాత్రం గుర్తుపడతారు. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ చెల్లిగా నటించింది. ఈ చిత్రంలో హీరోగా వెంకటేష్ నటించారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ఇప్పటికీ కూడా ప్రేక్షకులను సైతం కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా నటించింది. ఈ సినిమాలో చైల్డ్ ఆక్టర్ గా నటించిన సుదీప ఆ తర్వాత పలు సినిమాలలో నటించి సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని 'పింకీ' ఇప్పుడు ఏమి చేస్తుందో...? - Chai  Pakodi

ఇలా వెండితెరకు దూరమైన ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే గడిచిన కొంతకాలం నుంచి బుల్లితెర ప్రేక్షకులకు దూరంగా ఉన్నటువంటి సుదీప తాజాగా మళ్లీ బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఒక ఇంటర్వ్యూలో సుదీప తన గురించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది. సుదీప మాట్లాడుతూ శ్రీ రంగనాథ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో తను ప్రేమలో పడ్డాను అని తెలియజేసింది. అలా నాలుగేళ్ల పాటు తనతో ప్రేమలో ఉన్నానని అయితే తన ప్రేమ విషయం ఇంట్లో తెలియగానే ఇంట్లో వాళ్ళు తమ ప్రేమను ఒప్పుకోలేదని తెలియజేసింది.Bigg Boss Telugu 6 contestant Sudeepa Raparthi aka Pinky profile, photos,  biography and more - Times of Indiaఅలా తెలిసినప్పటి నుంచి తన పెళ్లి సంబంధాలు వెతకడం తమ తల్లిదండ్రులు మొదలు పెట్టారని అయితే నేను వాటిని రిజెక్ట్ చేయడంతో తనని బాగా తిట్టేవారు అంటూ ఈమె ఇంటర్వ్యూలో తెలియజేసింది. అలా ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక కుటుంబాన్ని ఎదిరించలేక చాలా నరకం అనుభవించానని తెలియజేసింది. చివరికి తన ప్రేమను గెలిపించుకున్నానని తెలియజేసింది సుదీప.

Share post:

Latest