వెంట్రుకలు నిక్కపొడిచేలా హరిహర వీరమల్లు సీన్.. ఇక థియేటర్‌లో కేకలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి పవర్ గ్లింప్స్‌/గ్లాన్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ చేత ఈలలు కొట్టించేలా ఉంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ వీడియోకి ఇప్పటికే కోటి వరకు వ్యూస్ రాగా.. ఇది మూడు రోజుల సమయం నుంచి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటిగా నిలుస్తోంది. నిజానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నాడని, అతని ప్రస్తుత సినిమాలన్నీ అటకెక్కాయని ఇటీవల రూమర్స్ వచ్చాయి. వాటన్నిటికీ ఈ వీడియో చెక్ పెట్టిందనే చెప్పాలి.

అయితే ఇప్పుడు ఇన్‌సైడ్ టాక్ ఏమిటంటే, ఈ మూవీలో వెంట్రుకలు నిక్కపొడిచేలా చేసే ఒక హైఎమోషనల్, యాక్షన్ సీన్ ఉంటుందట. ఈ సీన్ చూస్తే గూజ్‌బంప్స్ వస్తాయట. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీముడో పాట, ఆ తర్వాత ఆగ్రహానికి గురయ్యే ప్రజలను చూసి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో అలాంటి సన్నివేశం ఈ మూవీలో కూడా ఉంటుందట. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా చాలా గొప్ప సన్నివేశాలను చూపిస్తారట.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, హరిహర వీరమల్లు మూవీలో ఒకానొక క్రమంలో పవన్ కళ్యాణ్‌ను కొందరు బందీగా ఉంచుతారు. “పవన్‌ కోసం ఒక్కరు ముందుకు వచ్చినా, మేం అతన్ని విడుదల చేస్తాం” అని అతన్ని బందీ చేసిన వర్గాలు సవాల్‌ విసిరుతాయి. కానీ భయంతో ఎవరూ ముందుకు రారు. అయితే కొంతసేపటికి కొంతమంది పవన్ కళ్యాణ్ కోసం పోరాడతారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు. ఈ ప్రాణ త్యాగాలను కళ్లారా చూసిన చాలా మంది బాగా ఎమోషనల్ అయి పవన్ కళ్యాణ్‌ను రక్షించడానికి ముందుకు వస్తారు. ఈ సీన్ థియేటర్లలో ఈగలు వేయించడం కేకలు పుట్టించడం ఖాయమని అంటున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, నోరా ఫతేహి, సోనాల్ చౌహాన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share post:

Latest