వైసీపీ ఎంపీ మాధ‌వ్‌కు కూడా… 30 ఇయ‌ర్స్‌ పృథ్వీకి ప‌ట్టిన గ‌తేనా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్న సెగ కంటే .. సొంత పార్టీ నాయ‌కులు, న‌మ్ముకున్న నేత‌ల నుంచి వ‌స్తున్న సెగ‌లు.. పొగ‌లు పెరిగిపోతున్నాయి. ఇది ఆయ‌న‌ను రాజ‌కీయంగానే కాకుండా.. నైతికంగా.. మ‌రీముఖ్యంగా మ‌హిళా ప‌క్షపాతిగా ఉన్న పేరును కూడా డ్యామేజీ చేస్తున్నాయి. గ‌తంలో వైసీపీ నాయ‌కుడుగా ఉన్న సినిమా క్యారెక్ట‌ర్ న‌టుడు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు పృథ్వీ కూడా అప్ప‌ట్లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేశారు. మీడియా లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనూ.. వైసీపీ వాయిస్‌ను బ‌లంగా వినిపించారు. దీంతో పార్టీఅధికారంలోకి రాగానే..జ‌గ‌న్ ఆయ‌న కోర‌కుండానే.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన ఎస్వీబీసీ ఛానెల్‌కు చైర్మ‌న్‌ను చేశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ప‌ట్టుమ‌ని మూడు మాసాలు కూడా తిర‌గ‌కుండానే.. ఆయ‌న‌పై లైంగిక వేదింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

దీంతో వెంట‌నే జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం..పృథ్వీ ముఖం కూడా చూడ‌లేదు. దీనిపై ఇప్ప‌టికీ పృథ్వీ ఆవేద‌న‌తోనే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. వీడియా సాక్ష్యాల‌తో స‌హా జుగుప్సా క‌రంగా వ్య‌వ‌హ‌రించి… హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాద‌వ్ దొరికిపోయారు. ఇప్ప‌టికే ఇది కేవ‌లం ఏపీలో నే కాదు.. దేశ‌వ్యాప్తంగా అంద‌రి ఎంపీల చేతికి ఈ వీడియో వెళ్లిపోయింది. ఇప్ప‌టికే నెటిజ‌న్లు.. వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇలాంటి దౌర్భాగ్య‌క‌ర‌మైన ఎంపీలు వైసీపీలోనే ఉన్నారంటూ.. మ‌హిళా సంఘాలు కూడా మండిప‌డుతు న్నాయి. ఇక‌, ప్ర‌తిప‌క్షాల సంగ‌తి చెప్పేదేముంది…? జ‌గ‌న్‌పై మ‌రింత విమ‌ర్శ‌లు ఖాయం. ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో కేవ‌లం లైంగిక ఆరోప‌ణ‌ల‌తోనే.. పృథ్వీని ప‌క్క‌న పెట్టేసిన‌.. జ‌గ‌న్ ఇప్పుడు.. ఎంపీ మాధ‌వ్ విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతార‌నేది ఆస‌క్తిగా మారింది. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించి.. దిశ చ‌ట్టం కింద కేసు పెట్టిస్తారా? లేక‌.. పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసి.. ఆయ‌న‌పై అనర్హ‌త వేటు వేయిస్తారా? లేక‌.. మ‌నోడే క‌దా.. అని ఎదురు దాడితో త‌ప్పించుకుంటారా? అనేది చూడాల‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Share post:

Latest