తాడికొండ తగువు..ఇంకా డ్యామేజ్!

అధికార వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకునే విషయంలో నేతల మధ్య పోటీ పెరిగింది…అలాగే ఎవరికి వారు సీటు దక్కించుకోవాలనే క్రమంలో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు…ఇప్పటికే సీటు విషయంలో చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది…సిట్టింగ్ ఎమ్మెల్యేలు…సీటు ఆశించే నేతల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా పనితీరు బాగోని ఎమ్మెల్యే ఉన్నచోట్ల ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంది.

ఇదే క్రమంలో రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. మొదట నుంచి తాడికొండలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవికి…ఎంపీ నందిగం సురేశ్‌లకు పడని పరిస్తితి. అలాగే టీడీపీ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో కూడా పడటం లేదు. ఇక తాజాగా డొక్కాని తాడికొండ అదనపు సమన్వయకర్తగా నియమించాక రచ్చ మరింత పెరిగింది.

గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో టీడీపీ బలంగా ఉన్న అమరావతిలో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే…జగన్ గాలిలో తాడికొండలో శ్రీదేవి గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ఈమె పనితీరు మరీ గొప్పగా లేదు. పైగా రాజధాని రైతులకు దూరం అయ్యారు. అమరావతి ఉద్యమం చేసే ప్రజలని దూరం పెట్టారు. దీంతో శ్రీదేవిపై వ్యతిరేకత పెరిగింది..పైగా పేకాట, ఇసుకలో అక్రమాలు అంటూ పలు ఆరోపణలు శ్రీదేవిపై వచ్చాయి. దీంతో నెక్స్ట్  శ్రీదేవి మళ్ళీ పోటీ చేస్తే తాడికొండలో వైసీపీ గెలవడం కష్టమని అర్ధమైపోయింది.

అందుకే తాజాగా జగన్…డొక్కాని అదనపు సమన్వయకర్తగా పెట్టారు. దీంతో నెక్స్ట్ సీటు డొక్కాకే అని హింట్ ఇచ్చారు…ఈ క్రమంలో శ్రీదేవి ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. అనుచరులతో కలిసి నిరసన తెలియజేస్తున్నారు…అలాగే డొక్కాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు డొక్కా వర్గం కూడా పోటీగా నిరసనలు చేస్తుంది. దీంతో తాడికొండలో రెండు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అసలే డ్యామేజ్ ఉన్న చోట…ఈ వర్గ పోరు మరింత డ్యామేజ్ చేస్తుంది. ఏదేమైనా నెక్స్ట్ తాడికొండలో వైసీపీకి భారీ షాక్ తగిలేలా ఉంది.

Share post:

Latest