చిరంజీవి లేకుంటే నేను అప్పులలో కూరుకు పోయేవాడిని: శరత్ కుమార్

ప్రముఖ తమిళనాడు నటుడు R. శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు, కన్నడ ప్రేక్షకులకు మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ నటుడికి ఆర్థికంగా ఇబ్బందులు వెంటపడ్డాయట. ఈ విషయాన్ని శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అటువంటి సమయంలో చిరంజీవి తనకు సహాయం చేశారని ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు శరత్ కుమార్.. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.Gang Leader Movie || Sarath Kumar & Chiranjeevi Best Scene || Chiranjeevi,  Vijayashanti - YouTubeఇక ఆర్థిక ఇబ్బందులలో ఉన్న శరత్ కుమార్ కు. ఒక బడా నిర్మాత ఆయనకు ఆఫర్ ఇచ్చారట. శరత్ కుమార్ గారు మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోవాలి అంటే చిరంజీవి గారి సినిమా డేట్స్ తనకి దొరికేలా చేస్తే ఆ సినిమా లాభాలలో వాటా ఇస్తానని తెలియజేసారట. ఈ విషయం విన్న శరత్ కుమార్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చిరంజీవితో కలిసి అప్పటికే స్టువర్టపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు చేశారు. ఇక ఆ సినిమాలతోనే చిరంజీవితో తనకి స్నేహం ఏర్పడిందట. కానీ శరత్ కుమార్ చెప్పిన ప్రపోజల్ తో చిరంజీవి ఒప్పుకుంటాడా లేదా అని టెన్షన్ తో చిరంజీవికి కాల్ చేశారట.Sarathkumar reveals Chiranjeevi's huge gesture and turns emotional! - Tamil  News - IndiaGlitz.comచిరంజీవితో నేను మిమ్మల్ని కలిసాలని చిరంజీవిని శరత్ కుమార్ అడిగారట ఇక చిరంజీవి పిలవడంతో శరత్ కుమార్ హైదరాబాద్ కు వెళ్లి చిరంజీవిని కలిశారు అప్పుడు చిరంజీవి ఏదో సినిమా షూటింగ్లో ఉన్నారు తాను పర్సనల్గా మాట్లాడాలని చిరంజీవితో చెప్పగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి శరత్ కుమార్ తో మాట్లాడడం జరిగిందట. దీంతో శరత్ కుమార్ ఆశ్చర్యపోయారట. ఇక అంతే కాకుండా శరత్ కుమార్ ని ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టి వివరాలను కనుక్కున్నారట.. చిరంజీవికి తన పరిస్థితి వివరించారట శరత్ కుమార్ దీంతో తన డేట్స్ కావాలని శరత్ కుమార్ అడగడంతో.. ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారట. చిరంజీవి పారితోషకం ఎంత తీసుకుంటారని అడిగితే.. నాకు డబ్బులు వద్దు ఫ్రీగానే చేస్తాను నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకో అని చెప్పారట. దీంతో చిరంజీవి చేసిన మేలు మర్చిపోలేనిది అని ఎమోషనల్ అవుతూ తెలిపారు శరత్ కుమార్.

Share post:

Latest