జవాన్ చిత్రం కోసం విజయ్ సేతుపతి పారితోషకం అన్ని కోట్లా..?

యాక్టర్ విజయ్ సేతుపతి.. ఈ పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.. హీరో గా, విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షక ఆదరణ పొందారు. ఇక తనదైన స్టైల్ లో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్ సేతుపతి.. విజయ్ సేతుపతి హీరోగా రాణిస్తున్న సమయంలోనే పలు సినిమాలలో పలు పాత్రలు నటించి మెప్పించారు. తాజాగా కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో విలన్ గా నటించి.. మరొక మెట్టు ఎదిగారని చెప్పవచ్చు.Vijay Sethupathi teams up with director Ponram for upcoming project 'VJS46'  | The News Minuteఈ సినిమా విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి మరొకసారి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్.. ఈ సినిమాలో హీరోగా షారుక్ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో విజయ్ నటించేందుకు ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఇప్పటివరకు విజయ్ సేతుపతి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే గమనార్హం.Jawan': Vijay Sethupathi To Play Villain In Shah Rukh Khan's Next? Here's  What We Know - Entertainment

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇదంతా ఇలా ఉండగా జవాన్ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తూ ఉన్నది. అలాగే దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలు గెస్ట్ రోల్ లో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తూ ఉన్నారు.

Share post:

Latest