తెలుగు ప్రేక్షకులకు వరలక్ష్మి శరత్ కుమార్ అంటే తెలియకపోవచ్చు కానీ క్రాక్ సినిమాలో జయమ్మ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఈమె సీనియర్ నటుడు అయినా శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన అంతగా ఆకట్టుకోలేకపోయింది.. దాంతో పలు సినిమాలలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది. అలా ప్రస్తుతం ఎన్నో సినిమాలలో విలన్ గానే నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఇప్పుడు తాజాగా ఒక విషయంపై ఈమె మరొకసారి వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో ఒక నటుడిని తన పార్ట్నర్ అంటూ ట్విట్టర్ లో ఒక ఫోటోని షేర్ చేసి బర్త్డే విషెస్ ను తెలియజేశారు. ఇక అతను ఎవరో కాదు అలనాటి హీరోయిన్ స్నేహ భర్త యాక్టర్ ప్రసన్న. ఇక హ్యాపీ బర్త్డే పార్టనర్ ప్రసన్న హ్యావ్ ఏ బ్లాస్ట్ కీప్ రాకింగ్ అంటూ రాసుకుంది.. ఈ ట్విట్ కి యాక్టర్ ప్రసన్నతో దిగిన ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోవడం జరుగుతోంది.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విజయ్ నటించిన సర్కారు సినిమాలో విలన్ గా నటించి తన పాత్రకు తగ్గ నటనని కనబరచడంతో.. ఇక అప్పటినుంచి ఈమె ఎక్కువగా విలన్ పాత్రలోనే నటిస్తూ ఉన్నది. గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ కొన్ని కారణాల చేత విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్.
Happpppyyyy birthdayyyyyy partneerrrrrr @Prasanna_actor have a blasttttt and keepppppp rocking..!!! pic.twitter.com/wAoSlQUlnR
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) August 28, 2022