ట్రెండీ టాక్.. పుష్ప-2 లో పవర్ ఫుల్ విలన్.. ఎవరంటే..!!

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీగానే రాబట్టింది..బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంకా కాదు. ఏకంగా అక్కడ 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ప్రస్తుతం పుష్ప -2 కొసం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అంచనాలను అందుకోవడం కోసం డైరెక్టర్ సుకుమార్ చిత్ర బృందం ఎంతో కష్టపడుతున్నారు. స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడంతోపాటుగా షూటింగ్ అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు.Pushpa: The Rise - Part 1 (2021) - IMDbఅయితే ఎట్టకేలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా తాజాగా మొదలుపెట్టారు సెప్టెంబర్ మొదటి వారంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సీక్వెల్లో ఫహద్ ఫాజిల్.. మెయిన్ విలన్ గా నటించబోతున్నారు ఇక ఈ క్లైమాక్స్ కూడా అల్లు అర్జున్ ఫహాద్ ఫాజిల్ మధ్య భారీగా పోటీ తత్వం ఉండే విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ని హింట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమాలో సునీల్, అనసూయ, ధనుంజయ ఇలా ఈ సినిమాలో ఎంతోమంది నటిస్తున్నారు.Aadhi Pinisetty to fight it out with Allu Arjunఅయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరొక విలన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప పార్ట్-2 లో అల్లు అర్జున్ ను ఎదిరించి ఒక పొలిటికల్ రోల్ పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఇలాంటి పాత్రలో హీరో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్ర కోసం మరికొంతమంది యాక్టర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఆ నటుడు ఎవరనే విషయాన్ని చిత్ర బృందం కన్ఫామ్ చేసి అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.. మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారో చూడాలి.

Share post:

Latest