అమ్మాయిలు ఇష్టపడాలంటే.. మగవారిలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..!

సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక ఇదే విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి అబ్బాయిలూ.. మీరు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి..

సాధారణంగా ఈ సృష్టిలో స్త్రీ పురుష బంధం ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పవచ్చు . ఒకరికొకరు ఆకర్షణ అయితేనే వారి బంధం ముందుకు సాగుతుంది. ఇక నచ్చిన అమ్మాయిలను ఆకర్షించేందుకు వారికి నచ్చేలా కనిపించేందుకు అబ్బాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరి మీలో ఉండాల్సిన ఆ గుణాలు ఏమిటి అనే విషయానికి వస్తే ముందుగా

సెన్స్ ఆఫ్ హ్యూమర్.. అమ్మాయిలు ఎక్కువగా సీరియస్ ముఖం పెట్టే వ్యక్తులను ఇష్టపడరు. నవ్వించే వ్యక్తి కావాలి అని , నవ్వని వ్యక్తులను సైతం నవ్వించే విధంగా ఉండాలని కోరుతూ ఉంటారు. కాబట్టి మీలో హాస్య చతురతను పెంచుకుంటే మంచిది. అంతేకాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తులు సాధారణంగానే తెలివైన వారు అని కూడా అంటూ ఉంటారు.

నమ్మకం:
ముఖ్యంగా ఎవరినైనా సరే ఆకట్టుకునేది నిజాయితీ, నమ్మకమని చెప్పాలి. ఇక అలాగే ఆత్మవిశ్వాసం, మీ మీద మీకుండే నమ్మకం ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తాయి. ఇక మీరు దీనికి అందంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ మీలో ఉండే నిజాయితీ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

స్వతంత్రత:
అమ్మ చెప్పింది.. నాన్న చేయమన్నారు.. ఇలా మాట్లాడే వారిని అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. సొంత నిర్ణయాలు తీసుకునే వారిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు ఇంటి పనుల్లో సహాయం చేసే లక్షణం ఉన్న వారిని ఇంకా ఇష్టపడతారు అమ్మాయిలు అని చెప్పడంలో సందేహం లేదు.

మీ దగ్గర ఉంటే వారికి సురక్షితం అనిపించాలి..
ముఖ్యంగా ఒక అమ్మాయి తన కుటుంబ సభ్యులను వదిలి మీ దగ్గరకు రాబోతోంది అంటే మీ దగ్గర అమ్మాయికి పూర్తి సురక్షితం లభించాలి.. నిజంగా అమ్మాయిలు కూడా తమకు ఎవరి దగ్గరైతే సేఫ్టీ ఉంటుంది అని అనిపిస్తుందో వారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక సామాజికంగా, ఆర్థికంగా ఆమెకు సురక్షితం అనిపిస్తేనే మీ వెంట నడుస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి.

ఇక గడ్డం ఉంటే అమ్మాయి పడిపోతుంది అనేది మాత్రం అవాస్తవం.. మగవారు గడ్డం లేకపోతేనే కొంతమంది ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరికొంతమంది మ్యాన్లీగా కనిపిస్తారు. కాకపోతే గడ్డం ఉన్నవారు కూడా నీట్ గా మెయింటైన్ చేయాలి.. లేకపోతే అమ్మాయిలు మీ వైపు కూడా చూడరు. ఇక పరిశుభ్రత కూడా పాటించాలి. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నట్లయితే కచ్చితంగా ఆ అమ్మాయి మీ సొంతం అవుతుంది.

Share post:

Latest