ఇదెక్కడి విడ్డూరం.. అక్కడ అబ్బాయిలు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే.. జైలుకెళ్లాల్సిందే..!

భారత రాజ్యాంగం ప్రకారం.. ఒక భర్త, ఒక భార్య ఇద్దరు పిల్లలు అన్న నియమ నిబంధనలు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిందే అని కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఒక భర్త లేదా భార్య తమ భాగస్వామ్యలు మరణించడం లేదా వారితో విడాకులు తీసుకోవడం జరిగిన తర్వాతనే ఇంకొకరితో వివాహ బంధంతో ఒకటవచ్చు.. అలా కాదని ఎవరైనా రెండవ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వారికి జైలు జీవితం గడపాల్సిందే అని మన భారత రాజ్యాంగంలో ప్రచురించబడింది. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యగొలిపే మరొక విషయం ఏమిటంటే అక్కడ మాత్రం అబ్బాయిలు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించాల్సిందేనట.

నిజానికి వివాహం అనేది ఒక కీలకమైన ఘట్టమని చెప్పాలి.. ఇక చనిపోయే వరకు గుర్తుంచుకునే మధుర జ్ఞాపకం అది .. ఆ రోజు నుంచే ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఇక వివాహ సాంప్రదాయాలు.. రాష్ట్రాన్ని.. సామాజిక వర్గాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అంతేకాదు వివాహ చట్టాలు కూడా వేర్వేరు దేశాల్లో వేరువేరుగా ఉంటాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో.. వింత వివాహ సాంప్రదాయం ఉంది. ఇది సాంప్రదాయం మాత్రమే కాదు అక్కడి చట్టం కూడా.. అక్కడ నివసించే ఏ పురుషుడైనా సరే రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి.. ఒకవేళ రెండో పెళ్లికి నిరాకరిస్తే వారిని జైల్లో వేస్తారు.. అంతేకాదు ఏకంగా జీవిత ఖైదీ శిక్ష విధిస్తారు అని సమాచారం. ఇక స్త్రీలు కూడా తమ భర్త రెండో వివాహం చేసుకోవడానికి అంగీకరించాలి.. మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవాలి.. కాదని అడ్డు చెబితే వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఇక ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. స్త్రీలను పురుషులకు పోషించే శక్తి లేకపోయినా సరే కచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. అందుకే సాంప్రదాయాలకు విలువనిస్తూ చట్టాలను గౌరవిస్తూ అక్కడి మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వింత పద్ధతి ఎందుకు తీసుకొచ్చారు అంటే మన దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది .. అంటే పురుషులకంటే స్త్రీలు తక్కువగా ఉంటారు.. కానీ ఎరిత్రియాలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది . అందుకే స్త్రీ పురుష నిష్పత్తిని బాలన్స్ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారట. కానీ మరి కొంతమంది నుంచి వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఎరిత్రియాలో ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని నియమ నిబంధనలేమీ లేవని కూడా తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను భిన్నంగా వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం.