ఎన్టీఆర్‌నే ఎదిరించిన ఆ స్టార్ నటుడి భార్య‌… కార‌ణం ఇదే…!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సాంఘిక, జానపద, పౌరాణిక కథా చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించిన నటసార్వభౌముడు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సినీ కార్మికులకు ఏదైనా నష్టం , కష్టం వచ్చింది అంటే నేనున్నాను అంటూ ముందు నిలిచే గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ను ఏ రోజు కూడా ఎదిరించింది లేదు. ఇక దర్శకులు అయితే ఎన్టీఆర్ ఎలా చెప్తే అలా వినేవారు. ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన రాజకీయాలలో అడుగుపెట్టిన 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యంగా ఏలారు.Chalapathi Rao, NTR: ఆ హీరోలకూ తారక్ లాంటి ఫ్యాన్స్ ఉంటే.. చలపతిరావు కామెంట్స్ - senior actor chalapathi rao praises ntr and his fans for helping needy - Samayam Telugu

ఇక ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా కొనసాగింది. ఎవరికి ఏ నష్టాలు, కష్టాలు లేకుండా ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ కొంతమంది రాజకీయ నేతల కుట్రల వల్ల ఆయన తన పదవిని కోల్పోయి.. తర్వాత తన అల్లుడు చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీని అప్పగించడం జరిగింది. ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ నీ తలెత్తి చూసిన వారే లేరు.. ఇక అలాంటిది ఎదిరించడమా..? అన్న ప్రశ్నే వృధా అని అందరూ అంటారు . కానీ ఒక స్టార్ నటుడి భార్య మాత్రం ఏకంగా తన భర్త కోసం ఎన్టీఆర్ ను ఎదిరించి మరీ నిలబడింది.ntr-said that did not come into politics chalapathi rao chalapati rao, tollywood, actor, sn ntr, comment, politics - Telugu Chalapati Rao, Sn Ntr, Tollywood

ఇక ఆ స్టార్ నటుడు ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన భార్య అంటూ ఎప్పుడు మీడియాతో చెబుతూ.. ఆమె ఈరోజు తనతో లేదు అని ఎమోషనల్ అయినా సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన భార్య ఇందుమతి తన కోసం ఏకంగా ఎన్టీఆర్ ని ఎదిరించి మాట్లాడింది అని తెలిపారు.

ఇందుమతి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి .. మీరెందుకు మా ఆయనకు మంచి అవకాశాలు ఇవ్వడం లేదు? శోభన్ బాబు కంటే చాలా అందంగా ఉంటాడు.. నటన కూడా చాలా బాగా వచ్చు.. అలాంటిది మీరు ఎందుకు చిన్నచితకా పాత్రలు మాత్రమే ఇస్తున్నారు?అంటూ ఎన్టీఆర్ ను ఎదిరించిందట. ఇక ఆమె ఆవేదన అర్థం చేసుకున్న అన్నగారు చలపతిరావుకు మంచి పాత్రలు వచ్చేలా చేశారు.

Share post:

Latest