బాలకృష్ణ విషయంలో జయసుధ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత..!!

అలనాటి హీరోయిన్ జయసుధ తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో అవార్డుల విషయం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడంతో ఇండస్ట్రీలో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మాలాంటి వాళ్ళు పద్మశ్రీ అవార్డులకు పనికిరామ అనడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా ఈమె వైపు చూస్తోంది. ఈ విషయంపై సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించడం జరిగింది. వాటి గురించి చూద్దాం.Sri Rama Rajyam Telugu Movie Review Balakrishna Nayanatara Srik

ఇక ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలలో మాట్లాడడం కరెక్టే అని.. ఆ హక్కు కూడా మీకు ఉంది అని.. ప్రతిభ ఉండి అవార్డు రాలేదని అడుగుతున్నారు కానీ మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బాలకృష్ణ గారు నటించిన శ్రీరామరాజ్యం సినిమా లో బాలకృష్ణ చేసిన నటనకు నంది అవార్డు ఎందుకు రాలేదు అని అడిగారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటంటే శ్రీ రామరాజ్యం సినిమాకు నంది అవార్డు ఇవ్వాలని కమిటీ ఏకభిప్రాయం తీసుకోగా.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువలన రాముడు ,బీజేపీ ,ఆర్ఎస్ఎస్ వారు అంత ఒక్కటే కాబట్టి ఆ సినిమాకి అవార్డు ఇవ్వకూడదని ఆ పేరును కొట్టిపారేసినట్లు తెలియజేశారు.. ఆ అవార్డును ఇంకొక హీరోకి ఇచ్చినట్లు తెలిపారు ప్రసన్న కుమార్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సమయంలో నేషనల్ అవార్డులప్పుడు రామరాజ్యం సినిమా ఏ క్యాటగిరిలో కూడా అవార్డును ప్రకటించలేదు.. అంతేకాకుండా రాముడు కృష్ణుడికి సంబంధించి ఎటువంటి చిత్రం వచ్చినా కూడా ఆ సినిమాలకు అవార్డు ఇవ్వలేదని తెలియజేశారు. ఎందుకంటే ఇవన్నీ బిజెపి, ఆర్ఎస్ఎస్ అని వాళ్ళ అభిప్రాయం అని తెలిపారు. సరేలే అని రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇస్తుంది అనుకుంటే.. అప్పుడు కూడా అలానే చేశారు ఆ సమయంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి మీరు ఎందుకు మాట్లాడలేదు అని తెలిపారు.. ఇతరుల విషయంలో మాట్లాడాలంటే అది కుదరదు.. నాయకుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలని విదంగా కామెంట్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. మరి ఈయన చేసిన కామెంట్లపై జయసుధ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share post:

Latest