కుటుంబ సభ్యులే నమ్మించి.. రోడ్డుకు ఈడ్చారు..ఏకంగా కోట్లు పోగొట్టుకున్న ప్రముఖ నటి..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొన్ని కుటుంబాల వారు అంగీకరించరు. కానీ సినిమాల మీద ఆశతో కుటుంబాన్ని కూడా కాదని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే మరి కొంత మంది తమ పిల్లలను ఇండస్ట్రీలోకి పంపించి వారి డబ్బులను వాడుకొని తిరిగి వారినే రోడ్డుకు ఈడ్చిన వారు కూడా వున్నారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ శృంగార తార షకీలా కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వ్యాంప్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. నెల్లూరు జిల్లాలో పెరిగిన షకీలా మలయాళం సినిమాల ద్వారా మంచి ఫేమస్ ను సొంతం చేసుకోవడమే కాకుండా అక్కడ మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇకపోతే ఈమె నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయిఅంటే థియేటర్ల వద్ద మమ్ముట్టి , మోహన్ లాల్ నటించిన సినిమాలు కూడా వాయిదా పడేవి.. దీన్ని బట్టి చూస్తే మలయాళం అభిమానులలో షకీలా పై ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.Shakila Beautiful Scenes | Telugu Movie Scenes || TFC Movies Adda - YouTube

- Advertisement -

ఇకపోతే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకొని కోట్లు కూడబెట్టిన షకీలా గురించి తెలుసుకొని తన కుటుంబ సభ్యులు ఆమెను ఆదరించారు .ఇక షకీలా దగ్గర ఉన్న డబ్బుకు ఆశపడి ఆమె అక్క నీ దగ్గర ఇంత డబ్బు ఉంటే ఇన్కమ్ టాక్స్ వారు రైడ్ చేసే అవకాశం ఉంది. నా దగ్గర పెట్టు భద్రంగా దాచుకుంటాను అని చెప్పి.. ఏకంగా 2కోట్ల రూపాయలను తీసుకుందట. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నా దగ్గర లేదు ఖర్చయిపోయింది. అయినా నువ్వు ఎప్పుడు నాకు ఇచ్చావు అంటూ దబాయించిందట.Shakila Came Into Politics .. A Key Position In The Party

అంతేకాదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె డబ్బు లాక్కొని మోసం చేసి ఆఖరికి రోడ్డున పడేలాగా చేశారట.అయితే షకీలా ఇదంతా ఒక ఇంటర్వ్యూలో చెప్పగా పోలీసులకు కంప్లైంట్ చేయవచ్చు కదా అని యాంకర్ అడిగితే ..కుటుంబ సభ్యులు కదా ఏమి చేయలేని పరిస్థితి ..ఎవరి పాపాన వారే పోతారు అంటూ సరిపెట్టుకున్నానని షకీలా తెలిపింది .ఇక దీన్ని బట్టి చూస్తే షకీలా కుటుంబ సభ్యులే తనను మోసం చేయడం చాలా బాధాకరమని చెప్పవచ్చు.

Share post:

Popular