అందుకే మహేష్ ను ప్రిన్స్ ని ఊరికే అనరుగా..?

ఏ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో అయితే స్పెషల్ షోలు వేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి షో థియేటర్లలలో కళకళలాడుతూ ఉంటాయని గ్యారెంటీ ఏమి చెప్పలేము కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు పుట్టినరోజును ఆగస్టు 9వ తేదీన తెలుగు రాష్ట్రాలలోని ఫాన్స్ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయడం జరిగింది.Mahesh Babu Pokiri Movie: 15 Years for Pokiri: Why the Mahesh Babu and Ileana Starrer Became an All-time Industry Hitఅందుకు సంబంధించి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలు చేయడం జరుగుతూ వస్తోంది. ఇక అంతే కాకుండా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని మరొకసారి థియేటర్లలో విడుద చేయడమే కాకుండా ఆ టికెట్లు కూడా హాట్ కేకుల అమ్ముడుపోవడంతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇక ఒక కొత్త సినిమా చూడబోతున్నంత స్థాయిలో పోకిరి ఒక్కడు ,దూకుడు ,బిజినెస్ మేన్ వంటి సినిమాలకు టికెట్లు డిమాండ్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పోకిరి ఒక్కడు సినిమా పదుల సంఖ్యలో షోలు ప్రదర్శించబడుతున్నాయి.

పాత ప్రింట్లను రియాస్టర్ చేసి 4k విజువల్స్ తో విడుదల చేయడంతో మహేష్ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు అయితే ఈ సందడి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యూఎస్ఏ లో సైతం పలు స్పెషల్ చూడు విడుదల చేయడం గమనార్హం. కాలిఫోర్నియాలో ఒక థియేటర్లో పోకిరి స్పెషల్ షో కోసం బుకింగ్ ఓపెన్ చేస్తే కేవలం గంటలోనే మొత్తం థియేటర్ అంతా హౌస్ ఫుల్ అయిపోయిందట దీంతో పోకిరి సినిమా విడుదల ఇప్పటికి 18 ఏళ్లు అవుతున్న ఈ సినిమా ఇంతటి స్థాయిలో టికెట్ డిమాండ్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుచేతనే మహేష్ ను ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటారని ఆయన అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.

Share post:

Latest