ఘోరం… అమీర్‌కు పెద్ద‌ అవ‌మానం.. ‘ లాల్‌సింగ్ చ‌ద్దా ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు…!

ఘోరం… అమీర్‌కు పెద్ద‌ అవ‌మానం.. ‘ లాల్‌సింగ్ చ‌ద్దా ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు…!

భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తొలి రోజు ఘోరంగా నిరాశ ప‌రిచింది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ మిస్ట‌ర్‌ ప‌ర్పెక్ట్‌ అమీర్‌ఖాన్‌, కరీనా కపూర్ జంటగా నటించారు. తొలి రోజు వ‌సూళ్ల‌లో కొత్త రికార్డు క్రియేట్‌ చేస్తుందని అంద‌రు భావించారు. అయితే మొదటి రోజు బాక్సాఫీస్‌ కలెక్షన్లు అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చాయి.

అమీర్ రేంజ్‌కు స‌రితూగ‌లేనట్టుగా కేవలం రూ.11 కోట్లు మాత్రమే రాబ‌ట్టింది. అమీర్‌ఖాన్ సినిమాలో అన్నింటికంటే అతి త‌క్కువుగా ఫ‌స్ట్ డే ఆక్యుప్యెన్సీని న‌మొదు చేసిన సినిమాగా నిలిచింది. ఇది ఆమీర్‌ఖాన్ సినిమాల‌కు ఆందోళ‌న క‌లిగించే విష‌యమే. ఈ సినిమాకు పోటిగా అక్ష‌మ్‌కుమ‌ర్ ర‌క్ష‌బంధ‌న్ కూడా రిలీజ్ అయింది.

laal singh chddha, Box Office: 'Lal Singh Chadha' received cold reception  on its first day, fears about 'Rakshabandhan' came true! – aamir khan laal  singh chaddha vs akshay kumar raksha bandhan box

అయితే ఈ సినిమాకు కూడా మొద‌టి ఆట నుంచే ప్లాప్ టాక్ రావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొద‌టి రోజు కేవ‌లం రూ. 10 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. కాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకుంది. గతంలో అమీర్, కరీనా చేసిన ప్రకటనల కారణంగా ఈ చిత్రాన్ని బహిష్కరించాలని సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది. ఈ ఎఫెక్ట్ కూడా ఘోరంగా ప్ర‌భావం చూపింది.

Share post:

Latest