మన తెలుగు లేడీ యాంకర్స్ ఎంత డిమాండ్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు?

తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంక‌ర్లు చేతులనిండా బాగానే సందపాదిస్తున్నారు. వాళ్లు నెలకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు గూండాగి చస్తారు. అవును… తెలుగు ఇండ‌స్ట్రీలో నెం 1 యాంక‌ర్ అయినటువంటి సుమ క‌న‌కాల‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు ఈమె దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నిది టాక్. ఇది కేవ‌లం ఆడియో వేడుక‌ల‌కు మాత్ర‌మే. ఇక అవార్డు ఫంక్ష‌న్ అయితే రేట్ మ‌రోలా ఉంటుంది అనుకోండి.

ఆ తరువాత జబర్దస్త్ యాంకర్ అనసూయ సంపాదలో రెండో ప్లేస్‌లో ఉందని టాక్. గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొట్టే రంగ‌మ్మ‌త్త అంటే ప్రేక్షకులకు గిలిగింత. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య ఈవెంట్స్ చేయ‌డం మానేసిన అన‌సూయ‌.. టీవీ షోల‌తోనే బిజీగా ఉంది. దానికి తోడు సినిమా అవకాశాలు కూడా అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ తరువాత మ‌రో జ‌బ‌ర్ద‌స్థ్ యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్‌కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్‌కు తోడు ఓపెనింగ్స్‌తోనూ సంద‌డి చేస్తుంటుంది ర‌ష్మి. ఈ భామ రెమ్యున‌రేష‌న్ దాదాపు రూ. ల‌క్ష‌న్న‌రపైనే ఉంది.

ఇక వీరి తరువాత వరుసలో యాంకర్ శ్రీముఖుని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. లక్ష వరకు ఛార్జ్ చేస్తోంది. అలాగే రాఖీ సినిమాలో NTR చెల్లిగా న‌టించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు రూ. 50 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌. అలాగే యాంకర్ ప్రశాంతి తన రేంజ్‌లో ఓ మోస్తరుగా ఛార్జ్ చేస్తోంది. ఈమెకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 15 వేలకు ఛార్జ్ చేస్తుందనేది టాక్. అలాగే హీరోయిన్ నుంచి టీవీ నటిగా మారిన సుహాసిని ఒక్కోఎపిసోడ్‌కు రూ. 25 వేలు తీసుకుంటోందనేది పరిశ్రమ వర్గాల కథనం.

Share post:

Latest