సెక్స్ లైఫ్ పై తాప్సీ సంచలన కామెంట్స్..‘కాఫీ విత్ కరణ్ షో’ కి అందుకే దూరం..

బాలివుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ‘కాఫీ విత్ కరణ్ సీజ్-7’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇటీవల హీరో, హీరోయిన్లు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్ల కోసం పాల్గొంటున్నారు.. అయితే ఈ షో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలతో ఎప్పుడు వార్తల్లో ఉంటోంది.. ఈషోకు వచ్చిన ప్రముఖల సెక్స్ లైఫ్ గురించి కరణ్ ఓపెన్ గా ప్రశ్నలు అడుతున్నారు.. ఈ షోలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సమంతా, అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు తమ సెక్స్ లైఫ్ కి సంబంధించి ఓపెన్ గా సమాధానాలు చెప్పారు..

అయితే ఇంత మంది ప్రముఖులు పాల్గొన్న ఈ షోకు హీరోయిన్ తాప్సీ పన్నుకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.. ఆమె నటించిన దోబారా మూవీ ఆగస్టు 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భగా తాప్సీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో ఆమెకు కరణ్ షోకు ఆహ్వానం అందకపోవడంపై ప్రశ్న ఎదురైంది.. ఈ ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చింది. ‘కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా సెక్స్ లైఫ్ లేదు. అందుకే ఆ షోలో కనిపించలేదు’ అని బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ షోపై చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాప్సీ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తపరుస్తుంది.. సినిమాలు, వ్యక్తిగత జీవితంపై ఆమె ఇచ్చే స్టేట్మెంట్స్ వివాదాస్పదమవుతుంటాయి.

కాగా కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ షోకు వచ్చిన ప్రముఖుల సెక్స్ లైఫ్ గురించి ఎక్కువగా అడుగుతుంటారు. ఇటీవల లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే హాజరయ్యారు. వారిని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా సెక్స్ రిలేటెడ్ గా ఉన్నాయి. ఆ ప్రశ్నలకు విజయ్ దేవరకొండ కూడా సూటిగానే సమాధానాలు చెప్పాడు.

Share post:

Latest