సుడిగాలి సుధీర్ క్రేజ్ చూసి బిత్తరబోయిన యాంకర్ అన‌సూయ‌.. వామ్మో! అంత సీనుందా అంటూ?

సుడిగాలి సుధీర్.. ఇపుడు ఈ పేరు గురించి ప్రత్యేకించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెర షో జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అనతికాలంలోనే టాలీవుడ్ హీరోలకి తీసిపోకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ కామెడీతో ఆహుతులను అలరించాడు.

జబర్ధస్త్‌ షోతో మొత్తానికి సుధీర్ తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా మలుచుకున్నారు. దాంతో అతగాడికి వరుస సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సుధీర్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న చిత్రం వాంటెడ్‌ పండుగాడ్‌. కె. రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన రూపొందించిన చిత్రమిది. ఇందులో సుడిగాలి సుధీర్‌, సునీల్‌, అనసూయ, దీపికా పిల్లి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజుకి సిద్ధంగా వుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో సుడిగాలి సుధీర్ క్రేజ్ ఏంటో బ‌య‌ట ప‌డింది.

చివరగా రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడిన తర్వాత సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇవ్వగా ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరల్లినంత పనైంది. దాంతో సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ ఒక్కసారిగా అక్కడ బిత్తరబోయి చూస్తూ ఉండిపోయారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు సుధీర్‌.

Share post:

Latest